బెంగుళూరు: చంద్రయాన్-2  శనివారం నాడు తెల్లవారుజామున ఉదయం 1:55 గంటలకు ల్యాండ్ కానుంది. ఈ మేరకు ఇస్రో సర్వం సిద్దం చేసింది. 

అప్పుడే పుట్టిన శిశువును మీ చేతుల్లో పెడితే మీరు ఎలాంటి మద్దతు లేకుండా ఎలా పట్టుకొంటారని ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రశ్నించారు.అప్పుడే పుట్టిన శిశువు మాదిరిగానే చంద్రయాన్‌-2 విక్రమ్ ల్యాండర్ ‌ను జాగ్రత్తగా చంద్రుడి మీదకు తీసుకెళ్తున్నట్టుగా ఆయన తెలిపారు.

చంద్రుడిపైకి  ల్యాండర్ ను దించడం అంతా ఆషామాషీ విషయం కాదన్నారు. గతంలో ఈ పని చేసినవారికి కూడ ఇది కష్టమైన పనే అని ఆయన చెప్పారు.కానీ, ఇక్కడ తాము  ఈ ప్రక్రియను తొలిసారి నిర్వహిస్తున్నామని శివన్ గుర్తు చేశారు.

చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ దించడం కోసం ప్యారాచ్యూట్లను ఉపయోగించలేమని శివన్ చెప్పారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్రో  ప్రధాన కార్యాలయం బెంగుళూరులో  ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగే కార్యక్రమాన్ని  ప్రత్యక్షంగా తిలకించనున్నారు.

ప్రధాని మోడీతో కలిసి సుమారు 60 మంది హైస్కూల్ విద్యార్ధులు కూడ ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.అమెరికా,చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.

సంబంధిత వార్తలు

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్