Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

చంద్రయాన్-2 కీలక ఘట్టం పూర్తైంది. చంద్రుడికి 2.1 కిలో మీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో టెన్షన్ నెలకొంది.

Chandrayaan 2 Moon Landing: ISRO Control room awaits signal from Vikram lander
Author
Bangalore, First Published Sep 7, 2019, 2:21 AM IST


న్యూఢిల్లీ:  చంద్రయాన్-2 లో కీలక ఘట్టం పూర్తైంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చంద్రుడిపై దిగే ప్రక్రియలో కీలకమైన ఘట్టాన్ని కూడ పూర్తి చేశారు.కానీ, చంద్రుడికి 2.1కిలో మీటర్ల దూరంలోనే ల్యాండర్ విక్రమ్ నిలిచిపోయింది. ల్యాడర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రక్రియ సజావుగా సాగుతున్న తరుణంలోనే 300 మీటర్ల దూరంలోనే విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయాయి.

విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే ప్రక్రియలో చివరి దశను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే చంద్రుడికి అతి సమీపంలోకి చేరుకొన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుండి  ఇస్రోకు సిగ్నల్స్ నిలిచిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలోనే ఇస్రోకు విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ నిలిచిపోయాయి.

బెంగుళూరులోని ఇస్రో సెంటర్ నుండి ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన విద్యార్ధులు  చంద్రయాన్-2 ను ప్రత్యక్షంగా వీక్షించారు.ల్యాండర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయిన విషయాన్ని ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రధానికి వివరించారు.

అయితే ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని  మోడీ ధైర్యం చెప్పారు. మీరు సాధించింది తక్కువేమీ కాదు, భవిష్యత్తుపై ఆశావాహ థృక్పథంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు సూచించారు. 

ఇదిలా ఉంటే కమ్యూనికేషన్ డేటాను విశ్లేషిస్తున్నట్టుగా ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ లో సమస్యలు తలెత్తడానికి కారణాన్ని అన్వేషిస్తున్నట్టుగా శివన్ తెలిపారు.

చంద్రయాన్-2 లో కీలకమైన విక్రమ్ ల్యాండర్ కు ఐదు ఇంజన్లు ఉన్నాయి. ఒక్కో ఇంజన్ సామర్థ్యం 800 న్యూటన్లు ఉంటుంది. ల్యాండర్ కు మార్గనిర్దేశం చేసే ఇనర్షియల్ నేవిగేషన్ తో పాటు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సరిచేసే ఆప్టికల్ సెన్సర్లను అందులో బిగించారు.

చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవంపై ఇంతవరకు ఏ ఒక్క వ్యోమనౌక అడుగుపెట్టలేదు. దక్షిణ ధృవంపై ల్యాండయ్యేలా శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. రోవర్ పై భారత జాతీయ పతాకంతో పాటు, ఇస్రో చిహ్నలు ఉన్నాయి.

 

సంబంధిత వార్తలు

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

Follow Us:
Download App:
  • android
  • ios