శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని  కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు రంగం సిద్ధం చేసింది. 

ఇప్పటికే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లు రద్దుకు రాజ్యసభ ఆమోదం లభించిన నేపథ్యంలో మంగళవారం లోక్ సభలో జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు హోం శాఖ మంత్రి అమిత్ షా. 

ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్ధుల్లాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నుంచి మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. 

రేపు లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మెహబూబా ముఫ్తీని హరినివాస్ గెస్ట్ హౌస్ కు తరలించినట్లు సమాచారం.

మరోవైపు జమ్ము కశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భద్రతా బలగాలను భారీ సంఖ్యలో మోపింది. నిషేధాజ్ఞలు విధించింది. 

పోలీసుల పహారాలో జమ్ముకశ్మీర్ లోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. అటు దుకాణాలు సైతం మూసివేయబడ్డాయి. ఇకపోతే కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని వివిధ దేశాల రాయబారులకు భారత ప్రభుత్వం తెలియజేసింది. ఇది తమదేశ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభ ఆమోదం

ఆర్టికల్ 370 వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు, ఇక మార్పు వస్తోంది: లోక్ సభలో అమిత్ షా

లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుపై అమిత్ షా ప్రకటన

ఆర్టికల్ 370: శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదం, మోడీ ఉద్యమం

ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం: ఆర్టికల్ 370 రద్దుపై స్వరూపానంద

హత్యకేసులో ఉన్న వ్యక్తి హోంమంత్రి అయితే ఇలానే ఉంటుంది : ఆర్టికల్ 370 రద్దుపై సీపీఐ నేత రామకృష్ణ

సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి

మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్