కశ్మీర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శివసేన స్వాగతించింది. జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని నేడు కేంద్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కశ్మీర్ ని రెండు భాగాలుగా విభజించింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసింది. కాగా.. ఈ నిర్ణయాన్ని కొన్ని పార్టీలు స్వాగతిస్తుండగా... మరికొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి.

దీనిపై తాజాగా శివసేన చీఫ్ ఆదిత్య థాక్రే స్పందించారు. ఇది దేశం గర్వించగదిన విషయమని... చరిత్రలో నిలిచిపోతుందని  ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన తమ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.  అనంతరం ట్విట్టర్ వేదికగా.. ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.

‘ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్ నిజంగా భారత్ లో ఒక భాగమైంది. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి మార్గం సుగమం అయ్యింది. దేశ వ్యాతిరేక కార్యకలాపాలకు అవకాశం లేదు’’ అని ట్వీట్ చేశారు. 

‘‘ ఈ నిర్ణయం ఎంతో గర్వించదగిన విషయం. ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు. అందుకే గత ఎన్నికల్లో మేము ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకి మద్దతు ఇచ్చాం’’ అంటూ మరో ట్వీట్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని పౌరులు శాంతి భద్రతల నడుమ పురోగతి సాధిస్తారని... లబ్ధిపొందుతారని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలపాటు కశ్మీర్ ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఉండటం వల్లనే అభివృద్ధి సాధించలేకపోయింది’’ అని ఆదిత్య థాక్రే అభిప్రాయపడ్డారు. 

related news

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్