Asianet News TeluguAsianet News Telugu

ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభ ఆమోదం

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునర్ వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు హోంశాఖ మంత్రి అమిత్ షా.  . 

rajyasabha accepted article 370 cancellation
Author
New Delhi, First Published Aug 5, 2019, 6:31 PM IST

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునర్ వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు హోంశాఖ మంత్రి అమిత్ షా.  

అయితే జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేయగా 61 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఒకరు తటస్తంగా ఓటు వేశారు. అనంతరం రాజ్యసభలో జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాస్ అయినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం మంగళవారానికి రాజ్యసభను వాయిదా వేశారు. 

ఇకపోతే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ లో మారణకాండకు ఆర్టికల్ 370యే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. 

1950 నుంచి ఇప్పటి వరకు జరిగిన మారణ హోమాలకు ఆర్టికల్ 370యే కారణమంటూ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై మాట్లాడిన అమిత్ షా జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తెలియజేశారు.  

 అనంతరం జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభ ఆమోదం తెలిపింది. దాంతో ఆర్టికల్ 35ఏ రద్దు అయినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టారు హోం మంత్రి అమిత్ షా. 

అయితే డివిజన్ పద్దతిలో ఓటింగ్ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దాంతో డివిజన్ పద్దతిలో ఓటింగ్ చేపట్టాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే సాంకేతిక కారణాలతో ఆటోమేటిక్ ఓటింగ్ రికార్డింగ్ వ్యవస్థ పనిచేయలేదు. దాంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. 

ఇకపోతే ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు బీఎస్పీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, టీడీపీ ఏఐఏడీఎంకే, బిజు జనతా దళ్,ఆమ్‌ ఆద్మీ పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్‌, పీడీపీ, డీఎంకే,ఎండీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి.  

మెుత్తానికి జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేయడంతో మంగళవారం లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు హోం శాఖ మంత్రి అమిత్ షా. లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఇకపై జమ్ముకశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగనుంది. అయితే లడఖ్ మాత్రం అసెంబ్లీలేని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగనుంది. 

 ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు, ఇక మార్పు వస్తోంది: లోక్ సభలో అమిత్ షా

లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుపై అమిత్ షా ప్రకటన

ఆర్టికల్ 370: శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదం, మోడీ ఉద్యమం

ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం: ఆర్టికల్ 370 రద్దుపై స్వరూపానంద

హత్యకేసులో ఉన్న వ్యక్తి హోంమంత్రి అయితే ఇలానే ఉంటుంది : ఆర్టికల్ 370 రద్దుపై సీపీఐ నేత రామకృష్ణ

సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి

మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

Follow Us:
Download App:
  • android
  • ios