న్యూఢిల్లీ: 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్‌కు ఏ రకంగా ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, కొన్ని పార్టీల నేతలు ఆర్టికల్ 370 రద్దును ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయమై తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 370 ఆర్టికల్ ను బీజేపీ మొదటి నుండి వ్యతిరేకిస్తోంది. 

భారత్- పాకిస్తాన్ విభజన 1947లో జరిగింది. ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్   రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలనుకొన్నాడు.కానీ ఆ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్ లో విలీనమయ్యేందుకు అంగీకరించాడు.

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు, ఆనాటి కాశ్మీర్ నేత షేక్  మహమ్మద్ అబ్దుల్లా  విడతల వారీగా చర్చించిన తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ను జోడించారు.

కాశ్మీర్ రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాలు మినహా ఇతర ఏ  అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్  ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆర్టికల్ 370 ఉద్దేశ్యం.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 370 ఆర్టికల్ ద్వారా కల్పించిన ప్రత్యేక  అధికారాల ద్వారా ఈ రాష్ట్రంపై కేంద్రం 356  ఆర్టికల్ ను ప్రయోగించే అవకాశం లేకుండా పోయింది. 356 ఆర్టికల్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కేంద్రానికి ఉంది. కానీ, కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక అధికారాల వల్ల 356 ఆర్టికల్ ప్రయోగించే అవకాశం కూడ లేకపోయింది.  

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసే ఆర్టికల్స్ ను కాశ్మీర్ రాష్ట్రంలో ప్రయోగించలేరు. దేశంలో ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితులు నెలకొంటే విధించే అవకాశం ఆర్టికల్ 360 ద్వారా రాజ్యాంగం కల్పించింది. కానీ, ఆర్టికల్ 370 ద్వారా మాత్రం కాశ్మీర్ లో ఈ పరిస్థితిని అమలు చేయలేం.

ఇతర దేశాలతో యుద్దం వస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధించే వీలుంటుంది.  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వచ్చిన  సిఫారసుల ఆధారంగానే రాష్ట్రపతి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎమర్జెన్సీపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది.

1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది.1956 నవంబర్ లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తైంది. 1957 జనవరి 26న రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది.

ఆర్టికల్ 370ను తొలగించేందుకు సంబంధించి 2015 డిసెంబర్ లో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడ దాఖలైంది.ఈ విషయమై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు 2015లో స్పష్టం చేసింది. 

ఆర్టికల్ 370 మూడో విభాగం ప్రకారం దానిని ఉపసంహరించడంగానీ సవరించడం గానీ కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కాశ్మీర్ రాష్ట్ర చట్టం 35ఎను సంరక్షిస్తోందని కోర్టు వివరించింది.జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రిజర్వేషన్ 35 ఎ  ద్వారా  ఆ రాష్ట్రానికి  ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరూ కూడ ఆస్తులు కొనలేరు. 

సంబంధిత వార్తలు

స్వయం ప్రతిపత్తి రద్దు: మూడు ముక్కలైన కాశ్మీర్, గెజిట్ విడుదల

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం