కడప: ఆర్టికల్ 370  రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జమ్మకశ్మీర్. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

జమ్ముకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. కేంద్రం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని విమర్శించారు.  

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయమేనని ఆరోపించారు. కశ్మీర్‌ నాయకులను నిర్భందంలో ఉంచి దేశ విభజన సమయంలో పెద్దమనుషులు చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయడం సరికాదన్నారు. 

ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులు ఉన్న అమిత్‌ షా లాంటి వ్యక్తులకు హోంమంత్రి కేటాయిస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలని హితవు పలికారు.