- Home
- Life
- Tiles Cleaning: కిచెన్ లో టైల్స్ పై నూనె పడిందా? ఒకే ఒక్క నిమిషం లో టైల్స్ ని ఇలా శుభ్రం చేసేయండి..!
Tiles Cleaning: కిచెన్ లో టైల్స్ పై నూనె పడిందా? ఒకే ఒక్క నిమిషం లో టైల్స్ ని ఇలా శుభ్రం చేసేయండి..!
Tiles Cleaning: కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు... నూనె టైల్స్ పై పడుతూ ఉంటుంది. ఆ నూనె జిడ్డును వదిలించడం చాలా కష్టంగా ఉంటుందా? ఒకే ఒక పదార్థంతో ఆ నూనె మరకలు, జిడ్డును ఈజీగా వదిలించొచ్చు.

నేలపై నూనె జారి పడిందా?
వంటగదిలో పని చేసేటప్పుడు పొరపాటున నేలపై నూనె వలకడం సర్వసాధారణం. అయితే ఆ నూనె మరకను శుభ్రం చేయడం మాత్రం తీవ్రమైన చిరాకు తెప్పిస్తుంది. సాధారణంగా చాలామంది వెంటనే గుడ్డ లేదా టిష్యూ పేపర్ తీసుకొచ్చి తుడుస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల నూనె నేలంతా వ్యాపించి, జిడ్డు మరింత ఎక్కువవుతుంది. పైగా ఆ జిడ్డుపై కాలు వేస్తే జారిపడే ప్రమాదం కూడా ఉంది. కానీ, ఒక సింపుల్ అమ్మమ్మల నాటి చిట్కా వాడితే.. ఈ మరకలు, జిడ్డు ఈజీగా వదిలించొచ్చు.
'బేకింగ్ సోడా' మ్యాజిక్..
వంటగదిలో లభించే బేకింగ్ సోడాకు నూనెను, తేమను వేగంగా పీల్చుకునే సహజ గుణం ఉంది. ఇది జిడ్డును వ్యాపించకుండా ఒకే చోట గడ్డకట్టేలా చేస్తుంది. జిడ్డు మరకలను చాలా ఈజీగా
ఎలా శుభ్రం చేయాలి?:
నూనె ఒలికిన వెంటనే కంగారు పడకుండా, ఆ ప్రదేశం పూర్తిగా కవర్ అయ్యేలా కొద్దిగా బేకింగ్ సోడాను పైన చల్లండి. బేకింగ్ సోడా నూనెను పీల్చుకోవడానికి మీ చేతితో గానీ లేదా ఒక స్పూన్‌తో గానీ ఆ సోడాను నూనెలో తేలికగా కలపండి.కేవలం 1-2 నిమిషాల్లోనే నూనె మొత్తం బేకింగ్ సోడాతో కలిసిపోయి పొడి పిండిలా లేదా ముద్దలా మారిపోతుంది. ఇప్పుడు దానిని ఒక గుడ్డతో లేదా పేపర్ టవల్‌తో సులభంగా ఎత్తి పడేయవచ్చు. ఆ తర్వాత చిన్న తడి గుడ్డతో తుడిస్తే జిడ్డు అన్నదే లేకుండా టైల్స్ మెరిసిపోతాయి.
బేకింగ్ సోడా లేకపోతే ప్రత్యామ్నాయాలు:
ఒకవేళ మీ ఇంట్లో బేకింగ్ సోడా అందుబాటులో లేకపోతే, అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మీ కిచెన్‌లో ఉండే గోధుమ పిండి లేదా మైదా పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఇవి కూడా బేకింగ్ సోడాలాగే నూనెను వేగంగా పీల్చుకుని గడ్డకడతాయి. మరక కూడా చాలా తొందరగా తొలగిపోతుంది.
ఉప్పు ట్రిక్: వంటగదిలో ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో నూనె లేదా నెయ్యి కింద పడితే, వెంటనే దానిపై గుప్పెడు లావు ఉప్పు లేదా సన్న ఉప్పు చల్లండి. ఉప్పు నూనెను వేగంగా పీల్చుకుని గడ్డగా మారుస్తుంది. ఆ తర్వాత దాన్ని సులువుగా ఊడ్చేసి, తుడిచేయవచ్చు.
పౌడర్ / టాల్కమ్ పౌడర్ యూజ్: మీ ఇంట్లో బేకింగ్ సోడా లేదా పిండి అందుబాటులో లేకపోతే, ముఖానికి రాసుకునే టాల్కమ్ పౌడర్ కూడా జిడ్డును తుడిచిపెట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నూనె పడిన చోట పౌడర్ చల్లి 2 నిమిషాలు ఉంచితే అది నూనె మొత్తాన్ని పీల్చుకుంటుంది.
స్టవ్ దగ్గర ఎండిపోయిన జిడ్డు కోసం : స్టవ్ వెనుక ఉండే టైల్స్‌పై నూనె చిట్లి, జిడ్డు గట్టిగా ఎండిపోతుంటుంది. దీని కోసం సగం నిమ్మచెక్కపై బేకింగ్ సోడా వేసి, ఆ టైల్స్‌పై రుద్ది 5 నిమిషాల తర్వాత వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటితో తుడిస్తే ఎండిపోయిన జిడ్డు ఎంతటిదైనా వదిలిపోతుంది.
డిష్‌వాష్ లిక్విడ్ + గోరువెచ్చని నీళ్ళు: నూనెను తుడిచేసిన తర్వాత కూడా టైల్స్ పై జిగటగా అనిపిస్తే, కొద్దిగా గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్ లిక్విడ్ కలిపి గుడ్డతో తుడుస్తే టైల్స్ పై ఉన్న జిడ్డు వదిలి, మంచి సువాసనతో పాటు కొత్తవాటిలా మెరుస్తాయి.

