MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooking Tips: తక్కువ నూనెతో.. రుచిగా వంట చేయాలా? ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు..!

Cooking Tips: తక్కువ నూనెతో.. రుచిగా వంట చేయాలా? ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు..!

Cooking Tips: ఏదైనా కూర రుచిగా రావాలంటే నూనె ఎక్కువ వేయాల్సిందే అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, తక్కువ నూనెతో కూడా వంట కమ్మగా చేయాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 02 2026, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Cooking Oil
Image Credit : Asianet News

Cooking Oil

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.నూనె డబ్బా మార్చేయాలి..
Image Credit : Getty

1.నూనె డబ్బా మార్చేయాలి..

దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు.

2.తాలింపులో నీటి చుక్క వేయాలి..

మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి.

3.నూనె తొలగించాలి..

కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన తేలిన అదనపు నూనెను గరిటెతో జాగ్రత్తగా పక్కకు తీసేయండి. వంటలోని అసలు రుచి ఇప్పటికే ముక్కలకు పట్టి ఉంటుంది కాబట్టి, ఆ పైన ఉన్న నూనెను తీసేసినా రుచి మారదు, పైగా అనవసరమైన క్యాలరీలు మన శరీరంలోకి వెళ్లకుండా ఉంటాయి.

33
కూరల్లో నూనె తగ్గించడానికి బెస్ట్ చిట్కాలు..
Image Credit : AI Image

కూరల్లో నూనె తగ్గించడానికి బెస్ట్ చిట్కాలు..

నాన్-స్టిక్, కాస్ట్ ఐరన్ పాత్రలు: సాధారణ కడాయిలతో పోలిస్తే కాస్ట్ ఐరన్ లేదా మంచి క్వాలిటీ నాన్-స్టిక్ పాత్రలు వాడినప్పుడు 70% వరకు నూనె ఆదా అవుతుంది.

ఆయిల్ స్ప్రే బాటిల్ వాడకం: నూనెను గరిటెలతో పోయడానికి బదులు స్ప్రే చేయడం వల్ల పాన్ అంతటా సమానంగా పడుతుంది.వాడకం కూడా చాలా వరకు తగ్గుతుంది.

ఆవిరి వంటలు : కూరగాయలను నేరుగా నూనెలో వేపడానికి బదులు, ముందుగా కొద్దిగా ఉడకబెట్టి ఆ తర్వాత తేలికపాటి తాలింపు వేస్తే నూనె అవసరం తక్కువగా ఉంటుంది.

ఎయిర్ ఫ్రైయర్ లేదా బేకింగ్: సమోసాలు, పకోడీలు వంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఎయిర్ ఫ్రైయర్ వాడటం వల్ల 80-90% వరకు నూనెను తగ్గించవచ్చు.

 తక్కువ నూనె వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

గుండె ఆరోగ్యం: రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గడానికి, రక్తపోటు (BP) అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది.

బరువు నియంత్రణ: 1 స్పూన్ నూనెలో సుమారు 120 క్యాలరీలు ఉంటాయి. నూనె తగ్గించడం వల్ల అనవసరమైన క్యాలరీలు తగ్గించుకోవచ్చు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఎక్కువ నూనె ఉన్న ఆహారం తిన్నప్పుడు వచ్చే ఎసిడిటీ, గ్యాస్ , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ikkat Saree:ఆఫీస్ వేర్ కి సూటయ్యే కాటన్ చీరలు బడ్జెట్ ధరకే
Recommended image2
Aluminium Foil Safety: చపాతీలు, రోటీలను సిల్వర్ ఫాయిల్ లో చుడుతున్నారా? ఇది సేఫేనా?
Recommended image3
Tea: రోజూ టీ తాగే వారి చర్మం నల్లగా మారుతుందా? అసలు నిజమేంటి?
Related Stories
Recommended image1
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Recommended image2
Temple: ఈ గుడిలోకి చెప్పులు వేసుకొని లోపలికి వెళతారు... ఎందుకు అనుమతి ఇస్తారో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved