- Home
- Entertainment
- Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ షేక్.. ముఖేష్ గౌడ గ్రాండ్ ఎంట్రీ
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ షేక్.. ముఖేష్ గౌడ గ్రాండ్ ఎంట్రీ
`గుప్పెడంత మనసు` ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీవీలో రచ్చ చేసిన ఆయన ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌ని షేక్ చేసేందుకు రావడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి ముఖేష్ గౌడ గ్రాండ్ ఎంట్రీ
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ముఖేష్ గౌడ . సూపర్ హిట్ సీరియల్ 'గుప్పెడంత మనసు'లో 'రిషి సార్'గా కోట్లాదిమంది మహిళా అభిమానుల మనసు దోచుకున్న ఈ కన్నడ హ్యాండ్సమ్ హంక్, ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన 'బిగ్ బాస్' రియాలిటీ షో హౌస్‌లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాస్ట్ కంటెస్టెంట్‌గా ఆయన బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు. తనదైన పర్‌ఫెర్మెన్స్ తో అలరించారు. ముఖేష్ ఎంట్రీతో బిగ్ బాస్ షోకి ఊపు వచ్చిందని చెప్పొచ్చు.
రెండుసార్లు బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన ముఖేష్
నిజానికి ముఖేష్ గౌడకి బిగ్ బాస్ ఆఫర్ రావడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలోనే రెండుసార్లు బిగ్ బాస్ నిర్వాహకులు ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ, ఆ సమయాల్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గుప్పెడంత మనసు' సీరియల్ షూటింగ్‌తో అత్యంత బిజీగా ఉండటం, ఆ క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ కారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఆయన సున్నితంగా 'నో' చెప్పారు. సీరియల్ ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులకు ఇచ్చిన కమిట్‌మెంట్ కోసమే రెండుసార్లు వచ్చిన క్రేజీ ఆఫర్‌ను వదులుకున్నారు.
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో 'రిషి సార్' హంగామా!
'గుప్పెడంత మనసు' సీరియల్ ముగియడం, సరైన సమయం కుదరడంతో ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌కు ముఖేష్ గౌడ పచ్చజెండా ఊపారు. గ్రాండ్ లాంచ్ స్టేజ్‌పై తనదైన క్లాసీ అండ్ డాషింగ్ లుక్‌లో మెరిసిపోయిన ముఖేష్, బిగ్ బాస్ హౌస్‌లోకి గ్రాండ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ హౌజ్‌లో సత్తా చాటుతాడా?
బుల్లితెరపై కేవలం సైలెంట్ అండ్ క్లాస్ హీరోగా కనిపించిన ముఖేష్, రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? ఆయన మైండ్ గేమ్‌లు ఎలా ఆడబోతున్నారు? తన గ్లామర్‌తో హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్స్‌ను, బయట ఉన్న అభిమానులను ఎలా ఆకట్టుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీరియల్‌తో ఊహించని రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముఖేష్, బిగ్ బాస్ హౌస్‌లోనూ టైటిల్ ఫేవరెట్‌గా నిలవడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంత వరకు ఎంటర్‌టైన్ చేస్తారనేది చూడాలి.

