MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వెదర్.. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వెదర్.. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సహా 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 07 2026, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం
Image Credit : Gemini

ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ వాతావరణం సడన్‌గా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో పాటు, అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల గాలిలో వేగం విపరీతంగా పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Image Credit : Gemini

హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉండే జిల్లాల ప్రజలు రాబోయే 48 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. వాతావరణ శాఖ మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ఆరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు రోడ్లపై ఉన్న చెట్లను, కరెంట్ స్తంభాలను కూల్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా ఉండాలి.

Related Articles

Related image1
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Related image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
35
మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. అక్కడ పరిస్థితి ఏంటి?
Image Credit : Gemini

మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. అక్కడ పరిస్థితి ఏంటి?

కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం గట్టిగానే ఉండేలా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరంగా బయట తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు.

45
ఏపీలోనూ వర్షాలు. ఈదురుగాలుల హోరు
Image Credit : Gemini

ఏపీలోనూ వర్షాలు. ఈదురుగాలుల హోరు

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వాతావరణం కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఒకవైపు చినుకులు పడుతూనే, మరోవైపు ఉక్కపోత, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వల్ల ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

55
రాయలసీమలో మబ్బుల వాతావరణం
Image Credit : Gemini

రాయలసీమలో మబ్బుల వాతావరణం

రాయలసీమ వ్యాప్తంగా వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉదయాన్నే చూస్తే ఎండగా, వాతావరణం పొడిగా అనిపించినా.. మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి డార్క్ క్లైమేట్ వచ్చేస్తుంది. ఉరుములు, మెరుపులతో వాన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Recommended image2
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image3
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Related Stories
Recommended image1
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved