MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా

Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా

Bigg Boss 20 : బిగ్ బాస్ 20 ఇంట్లోకి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా పంపిన ప్రత్యేక వీడియో మేసేజ్ హౌస్‌మేట్స్‌కు హెచ్చరికగా నిలిచింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 07 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బాక్సింగ్ లెజెండ్
Image Credit : chatgpt

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బాక్సింగ్ లెజెండ్

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' 20వ సీజన్ చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆదివారం ప్రారంభమైన ఈ షోకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా భారత బాక్సింగ్ దిగ్గజం, ఒలింపిక్ విజేత మేరీ కోమ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. రింగ్‌లో ఎందరో ప్రత్యర్థులను పంచ్‌లతో పడగొట్టిన మేరీ కోమ్, ఇప్పుడు 105 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో సరికొత్త సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొడుకులతో వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చిన మేరీ కోమ్
Image Credit : Instagram/mcmary.kom

కొడుకులతో వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చిన మేరీ కోమ్

మేరీ కోమ్ హౌస్‌లోకి రావడం ఈ సీజన్‌కే పెద్ద హైలైట్‌గా మారింది. సెట్‌కి ఆమె ఒంటరిగా రాలేదు. ఆమె కుమారులు రెచుంగ్‌వర్, ఖుప్నేవర్ తమ తల్లికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి బిగ్ బాస్ సెట్‌కు వచ్చారు. తల్లి కొత్త ప్రయాణాన్ని చూసి వారు ఎంతో ఉత్సాహపడ్డారు. హౌస్‌లోకి వెళ్లే ముందు మేరీ కోమ్ తన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. "ఇంట్లో తల్లిగా ఉండటం నా వ్యక్తిత్వంలో ఒక భాగం. స్పోర్ట్స్‌పర్సన్‌గా రింగ్ లోపల గెలవాలనే పట్టుదల నా మరో రూపం. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఇంట్లో ప్రేక్షకులు నాలోని అనేక కొత్త కోణాలను చూస్తారు" అని ఆమె పేర్కొన్నారు.

Related Articles

Related image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వెదర్.. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్
Related image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
35
ప్రియాంక చోప్రా స్పెషల్ మెసేజ్.. హౌస్‌మేట్స్‌కు వార్నింగ్

ప్రియాంక చోప్రా స్పెషల్ మెసేజ్.. హౌస్‌మేట్స్‌కు వార్నింగ్

మేరీ కోమ్ ఎంట్రీని మరింత స్పెషల్‌గా మార్చేందుకు హోస్ట్ సల్మాన్ ఖాన్ ఒక సర్ ప్రైజ్ వీడియో ప్లే చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మేరీ కోమ్ కోసం ఒక ప్రత్యేక వీడియో మెసేజ్ పంపారు. ఇందులో మేరీకి శుభాకాంక్షలు తెలుపుతూనే, మిగతా కంటెస్టెంట్లకు సరదాగా హెచ్చరిక చేశారు. "ఆమె ఇచ్చే నాకౌట్ పంచ్ చాలా భారంగా ఉంటుంది. మేరీ, మీరు ఎలా ఉంటారో హౌస్‌లో కూడా అలాగే ఉండండి. మీ జర్నీ చూడటానికి నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. చాలా చాలా ప్రేమతో" అని ప్రియాంక ఆ వీడియోలో పేర్కొన్నారు.

45
2014 నాటి బంధం.. మళ్లీ గుర్తు చేసుకున్న అభిమానులు
Image Credit : Instagram/mcmary.kom

2014 నాటి బంధం.. మళ్లీ గుర్తు చేసుకున్న అభిమానులు

ప్రియాంక చోప్రా, మేరీ కోమ్ మధ్య చాలా ఏళ్లుగా మంచి స్నేహబంధం ఉంది. 2014లో దర్శకుడు ఒముంగ్ కుమార్ తెరకెక్కించిన 'మేరీ కోమ్' బయోపిక్ చిత్రంలో ప్రియాంక చోప్రానే మేరీ కోమ్ పాత్రలో నటించారు. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 'ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం'గా జాతీయ అవార్డును గెలుచుకుంది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది.

55
105 రోజుల సుదీర్ఘ పోరు.. టైమింగ్స్ ఇవే
Image Credit : Instagram/mcmary.kom

105 రోజుల సుదీర్ఘ పోరు.. టైమింగ్స్ ఇవే

మేరీ కోమ్ ఇప్పటివరకు ఆరుసార్లు వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించారు. 2020లో ఆమెకు పద్మవిభూషణ్ లభించింది. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె, ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో 105 రోజులు ఉండబోతున్నారు. ఈ సీజన్ జియోహాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు, కలర్స్ టీవీలో రాత్రి 10:30 గంటలకు ప్రసారం అవుతోంది. ఈ సీజన్‌లో మేరీ కోమ్‌తో పాటు ఆసిఫ్ ఖాన్, కనికా మన్, స్కౌట్ ఓపి (తన్మయ్ సింగ్), ఆమ్రపాలి దూబే, మహీ విజ్, యంగ్ డీఎస్ఏ, ఖాజీ తౌకీర్, అరీష్ఫా ఖాన్, రోహెద్ ఖాన్, ఇషా రిఖీ, గుల్లు (కుశాల్ తన్వర్) తదితరులు పోటీపడుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Recommended image2
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
OTT Movies: బాడీగార్డ్ తో వ్యాపారవేత్త కూతురు రొమాన్స్.. ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాల జోరు
Related Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వెదర్.. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్
Recommended image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved