- Home
- Entertainment
- Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
భారతదేశంలోని వివిధ భాషల బిగ్‌బాస్ షోలకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న స్టార్‌ల రెమ్యునరేషన్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు.

బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్
భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. అయితే షోలో పాల్గొనే కంటెస్టెంట్ల కంటే హోస్ట్‌లుగా వ్యవహరించే స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పైనే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. నేషనల్ మీడియా ప్రకారం వివిధ భాషల బిగ్‌బాస్ హోస్ట్‌లకు అందుతున్న పారితోషిక వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ కింగ్ నాగార్జున తదుపరి స్థానాల్లో ఉన్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ – హిందీ బిగ్‌బాస్
హిందీ బిగ్‌బాస్‌కు ఎన్నో సీజన్లుగా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన హోస్టింగ్, వీకెండ్ ఎపిసోడ్లలో కంటెస్టెంట్లతో వ్యవహరించే తీరు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందుతున్న సమాచారం ఆయన ఒక సీజన్‌కు సుమారు రూ.125 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు రూ.15 కోట్లకు పైగా తీసుకుంటున్నారనే వార్తలు కూడా ఉన్నాయి.
విజయ్ సేతుపతి – తమిళ బిగ్‌బాస్
తమిళ బిగ్‌బాస్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలి, సహజమైన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయనకు ఈ షో కోసం రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బిగ్‌బాస్ హోస్ట్‌లలో ఆయన ఒకరిగా నిలిచారు.
నాగార్జున – తెలుగు బిగ్‌బాస్
తెలుగు బిగ్‌బాస్‌కు కింగ్ నాగార్జున వరుసగా హోస్ట్‌గా కొనసాగుతున్నారు. కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ, అవసరమైన సమయంలో సీరియస్‌గా క్లాస్ తీసుకునే నాగార్జున హోస్టింగ్‌కు మంచి ఆదరణ ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఒక సీజన్‌కు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
మోహన్‌లాల్ – మలయాళం బిగ్‌బాస్
మలయాళ బిగ్‌బాస్‌కు సూపర్ స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్టార్ ఇమేజ్ షోకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ కార్యక్రమం కోసం మోహన్‌లాల్‌కు సుమారు రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం.
కిచ్చా సుదీప్ – కన్నడ బిగ్‌బాస్
కన్నడ బిగ్‌బాస్‌కు చాలా కాలంగా కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడ ప్రేక్షకుల్లో ఆయనకు ఉన్న భారీ ఫాలోయింగ్ షో విజయానికి కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతుంటారు. రిపోర్ట్స్ ప్రకారం బిగ్‌బాస్ హోస్టింగ్ కోసం ఆయన సుమారు రూ.20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
సౌరవ్ గంగూలీ – బెంగాలీ బిగ్‌బాస్
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బెంగాలీ బిగ్‌బాస్‌తో వార్తల్లో నిలిచారు. ఆయనకు సంబంధించిన డీల్ విలువ కూడా భారీగానే ఉందని సమాచారం. నాలుగేళ్ల ఒప్పందానికి రూ.125 కోట్ల వరకు డీల్ కుదిరినట్లు నేషనల్ మీడియారిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

