MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Insects: పిండికి పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న పనిచేస్తే.. మళ్లీ పురుగులు పట్టవు..!

Insects: పిండికి పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న పనిచేస్తే.. మళ్లీ పురుగులు పట్టవు..!

Insects: వర్షాకాలం వస్తే చాలు.. డబ్బాల్లో స్టోర్ చేసిన పప్పులు, పిండిలకు పురుగులు పట్టేస్తూ ఉంటాయి. ఆ పరుగులు తీసేయలేక.. వాటిని పారబోస్తూ ఉంటాం. కానీ, అసలు పురుగులు రాకుండా ఏం చేయాలో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 07 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Bugs
Image Credit : AI

Bugs

ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఎదురయ్యే అతి పెద్ద సమస్య.. పిండి లేదా పప్పుల డబ్బాల్లో పురుగులు చేరడం. రోజూ వాడే గోధుమ పిండి, రవ్వ లేదా ఎప్పుడో ఒకసారి వాడే మైదా, శనగపిండి డబ్బా తీయగానే అందులో చిన్న చిన్న పురుగులు కనిపించగానే.. అయ్యో.. పిండి పాడైపోయిందే అని పడేస్తూ ఉంటాం. కానీ, అసలు ఈ పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి రాకుండా ఉండాలన్నా, వచ్చిన వాటిని ఎలా పోగొట్టాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పిండిలోకి ఈ పురుగులు ఎలా వస్తాయి?
Image Credit : Gemini AI

పిండిలోకి ఈ పురుగులు ఎలా వస్తాయి?

మనం బయట షాపులు లేదా సూపర్‌మార్కెట్ల నుంచి తెచ్చే గోధుమలు, రవ్వ, శనగపిండి, మైదా, బియ్యం, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పొడి ఆహార పదార్థాలు 'ప్యాంట్రీ పెస్ట్స్' అనే కీటకాలకు ప్రధాన ఆవాసంగా మారతాయి. నిజానికి ఈ కీటకాల గుడ్లు లేదా లార్వాలు మనం కొనేటప్పుడే ఆహార ప్యాకెట్లలోనే ఉండిపోతాయి. మనం ఆ ప్యాకెట్లను ఇంటికి తెచ్చి డబ్బాల్లో పోసి, గాలి , తేమ తగిలేలా ఉంచినప్పుడు, ఆ గుడ్లు పొదిగి పురుగుల్లా మనకు కనిపిస్తాయి.

Related Articles

Related image1
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Related image2
Kitchen Hacks: కిచెన్ లో అత్యంత ప్రమాదకరమైనవి ఇవి.. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ మురికి ఉండేవి ఇవే..!
33
పిండిలో పురుగు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?
Image Credit : Gemini AI

పిండిలో పురుగు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?

పిండిలో పురుగులు, లార్వాలు లేదా వలలు స్పష్టంగా కనిపిస్తే, ఆ పిండిని ఏమాత్రం వాడకుండా ఒక ప్లాస్టిక్ కవర్ లేదా కవరులో గట్టిగా మూసివేసి బయట చెత్తబుట్టలో పడేయడం ఉత్తమం. పిండి ఉన్న అరలోని బియ్యం, పప్పులు, రవ్వ, మసాలాలు, బిస్కెట్ ప్యాకెట్లను కూడా వెంటనే చెక్ చేయండి. ఎందుకంటే ఈ పురుగులు ఒక డబ్బా నుంచి మరొక డబ్బాలోకి వేగంగా వ్యాపిస్తాయి. అరలలోని మూలల్లో, సందుల్లో ఒలికిన పిండి రేణువులు ఉంటే వాటిని వాక్యూమ్ క్లీనర్‌తో లేదా తడి గుడ్డతో క్షుణ్ణంగా శుభ్రం చేయండి.

పురుగులు పట్టకుండా ఉండేందుకు స్మార్ట్ కిచెన్ చిట్కాలు:

పిండి, ధాన్యాలను తెరిచి ఉన్న కవర్లలో ఉంచకుండా, గాలి చొరబడని గాజు లేదా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఎయిర్ టైట్ డబ్బాలలోనే నిల్వ చేయండి. పిండి లేదా బియ్యం డబ్బాల్లో 2-3 బిర్యానీ ఆకులు, కొన్ని లవంగాలు లేదా ఎండిన వేపఆకులు వేసి ఉంచితే వాటి ఘాటైన వాసనకు పురుగులు దరిచేరవు.

మార్కెట్ నుంచి పిండి లేదా రవ్వ తెచ్చిన వెంటనే ఆ ప్యాకెట్‌ను 24 నుంచి 48 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. దీనివల్ల అందులో ఏవైనా కంటికి కనిపించని గుడ్లు ఉంటే పూర్తిగా నశిస్తాయి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ లేదా సేమియా వంటివాటిని తెచ్చిన వెంటనే బాణలిలో దోరగా వేయించి, చల్లారాక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా పురుగు పట్టదు.

సరుకులు కొనేటప్పుడే ప్యాకెట్ ఎక్కడైనా చిరిగిపోయిందో లేదా ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడిందో సరిచూసుకోండి. ముందుగా ఇంటికి తెచ్చినవి వాడి.. ఆ తర్వాతే కొత్తవి వాడటం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: 1 గ్రాము బంగారంలో డైలీవేర్ ఇయర్ రింగ్స్, ఓ లుక్కేయండి
Recommended image2
Earrings: చెవులకు నిండుగా అందమైన కమ్మలు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image3
Fruits: తాజా పండ్లు తినాలా? లేక డ్రై ఫ్రూట్స్ తినాలా? రెండింట్లో ఏవి మంచివి?
Related Stories
Recommended image1
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Recommended image2
Kitchen Hacks: కిచెన్ లో అత్యంత ప్రమాదకరమైనవి ఇవి.. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ మురికి ఉండేవి ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved