MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Almonds: రోజూ ఉదయాన్నే నానపెట్టిన బాదం తింటున్నారా? మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే

Almonds: రోజూ ఉదయాన్నే నానపెట్టిన బాదం తింటున్నారా? మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే

Almonds: బాదం పప్పు తినే అలవాటు ఉందా? ప్రతిరోజూ ఉదయాన్నే బాదం పప్పు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? అసలు రోజుకి ఎన్ని బాదం తినాలి? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 03 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Almonds
Image Credit : Getty

Almonds

బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మనకు తెలిసిందే. మన అమ్మమ్మల కాలం నుండి ఉదయాన్నే బాదం తినమని చెప్పుతూనే ఉంటారు. అయితే, బాదం పప్పు డైరెక్ట్ గా తినే కంటే... నానపెట్టినవి తింటే మరింత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ప్రతిరోజూ నానపెట్టిన బాదం పప్పులను 4 నుంచి 5 తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బాదం పప్పును నానపెట్టిన తర్వాతే ఎందుకు తినాలి?
Image Credit : Getty

బాదం పప్పును నానపెట్టిన తర్వాతే ఎందుకు తినాలి?

ఎండు బాదం పప్పు పొట్టులో 'ఫైటిక్ యాసిడ్' , 'టానిన్లు' ఉంటాయి. ఇవి బాదంలోని పోషకాలు మన శరీరానికి సరిగ్గా అందకుండా అడ్డుకుంటాయి. బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టినప్పుడు ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, జీర్ణక్రియను సులభతరం చేసే ఎంజైమ్‌లు విడుదలవుతాయి. దీనివల్ల పోషకాలు శరీరానికి అందుతాయి.

33
రోజూ బాదం పప్పు తింటే కలిగే ప్రయోజనాలు...
Image Credit : Getty

రోజూ బాదం పప్పు తింటే కలిగే ప్రయోజనాలు...

మెదడు పదునుగా మారుతుంది : బాదంలో ఉండే విటమిన్-E, ఎల్-కార్నిటైన్ , రిబోఫ్లేవిన్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అల్జీమర్స్ వంటి సమస్యల నుండి మెదడును కాపాడతాయి.

బరువు తగ్గానికి హెల్ప్ చేస్తుంది: వీటిలోని ప్రొటీన్, ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఉదయాన్నే ఇవి తినడం వల్ల రోజంతా అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరికలు తగ్గుతాయి.

గుండె ఆరోగ్యం బలంగా ఉంటుంది: బాదంలోని యాంటీఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బిపి నియంత్రణలో ఉంటుంది.

చర్మం ప్రకాశవంతంగా మారుతుంది: విటమిన్-E పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. ముడతలు తగ్గి, చర్మం సహజంగా మెరుస్తుంది.

షుగర్ లెవల్స్ కంట్రోల్: బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, టైప్-2 డయాబెటిస్ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది.

బాదం పప్పు ఎలా తినాలి..?

రాత్రి వేళ 4-5 బాదం పప్పులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే దాని పైన ఉండే గోధుమ రంగు పొట్టును తీసివేసి, బాగా నమిలి తినండి. క్రమం తప్పకుండా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు మీకు లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు
Recommended image2
River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?
Recommended image3
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Related Stories
Recommended image1
Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?
Recommended image2
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved