MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?

Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?

Toxic Collections: భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించినా.. ఆతరువాత కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. యశ్ హీరోగా నటించిన ఈసినిమా ఆరో రోజు ఎంత వసూలు చేసిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 01 2026, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
300 కోట్ల మార్క్ ను దాటిన టాక్సిక్..
Image Credit : X/@KvnProductions

300 కోట్ల మార్క్ ను దాటిన టాక్సిక్..

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భారీ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమా..
Image Credit : X

భారీ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమా..

ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్‌ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్‌కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది.

34
సోమవారం కలెక్షన్ల వివరాలు..
Image Credit : Instagram

సోమవారం కలెక్షన్ల వివరాలు..

టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్‌లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో ఈసినిమా ఆరో రోజు 2 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది.

44
ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ..
Image Credit : X/@KvnProductions

ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ..

పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా వివిధ ప్రాంతాల్లో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఆరో రోజున థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ, ఓవర్సీస్ తో పాటు ప్రధాన ప్రాంతీయ కేంద్రాలలో టాక్సిక్.. స్ట్రాంగ్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. వారాంతం పూర్తయిన తర్వాత వర్కింగ్ డేస్‌లో వచ్చే ఈ రకమైన తగ్గుదల సాధారణమేనని, వీకెండ్ నాటికి మళ్లీ వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, 'టాక్సిక్' చిత్రం ఆరో రోజునాటికి రూ. 304.05 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించే దిశగా ప్రయాణిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image2
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved