MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ఐఎండీ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో గాలులు, భారీ వర్షాలు

Weather Update: ఐఎండీ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో గాలులు, భారీ వర్షాలు

Weather Update: ఈ వారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా ఉండనుంది?
Image Credit : Getty

ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా ఉండనుంది?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు పడతాయా లేదా అనే విషయాలపై స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఈ మేరకు 7 రోజుల వెదర్ రిపోర్టును అధికారికంగా అందించాయి.

ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. అయితే, కొన్ని రోజులు ఉపరితల గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉత్తర కోస్తా, యానాంలకు అలర్ట్
Image Credit : Gemini

ఉత్తర కోస్తా, యానాంలకు అలర్ట్

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

అంతేకాకుండా, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40-50 kmph వేగంతో గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 తర్వాత వర్షాలు ఉన్నప్పటికీ గాలుల హెచ్చరికలు ఏమీ ఉండవు.

Related Articles

Related image1
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Related image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
35
దక్షిణ కోస్తా, రాయలసీమ వెదర్ అప్‌డేట్
Image Credit : Gemini

దక్షిణ కోస్తా, రాయలసీమ వెదర్ అప్‌డేట్

దక్షిణ కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఈ వారం మొత్తంలో ఒక్కటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే రాయలసీమ పరిధిలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 5 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 నుండి 7 వ తేదీ వరకు వాతావరణం సాధారణ తేలికపాటి వర్షాలతో ప్రశాంతంగా ఉంటుంది.

45
తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు
Image Credit : Getty

తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు

తెలంగాణలో సెప్టెంబర్ 1 నంచి 7 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మొదటి రెండు రోజులు అంటే ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 2 ఉదయం 08:30 గంటల వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 2 నుండి 7వ తేదీ వరకు రోజుల్లో ఎలాంటి ప్రత్యేక గాలులు కానీ, వర్ష హెచ్చరికలు కానీ లేవు.

55
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Image Credit : Getty

ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వాతావరణ శాఖ సూచించిన ప్రమాద స్థాయిల ప్రకారం ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సమయంలో లేదా ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిది.

విద్యుత్ స్తంభాలు, పాత గోడలు లేదా ఒంటరిగా ఉన్న పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఐఎండి స్పష్టం చేసింది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రభుత్వ యాప్‌లైన 'మౌసమ్' (Mausam), 'దామిని' (Damini), వ్యవసాయం కోసం 'మేఘదూత్' (Meghdoot) యాప్‌లను ఉపయోగించాలని సూచించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Flight: తిరుప‌తికి కొత్త విమాన స‌ర్వీస్‌.. టైమింగ్స్, టికెట్ ధ‌ర వివ‌రాలు
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
Recommended image3
Now Playing
CM Chandrababu Serious On Collectors In Meeting | Chandrababu Latest | Asianet Telugu
Related Stories
Recommended image1
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Recommended image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved