MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం

Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం

పవన్ కళ్యాణ్ నుంచి ఎన్టీఆర్ వరకు కొందరు అగ్ర హీరోలు కొన్ని సినిమాలలో బెస్ట్ లుక్స్ తో కనిపించారు. కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 01 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tollywood Heroes Best Looks
Image Credit : Asianet News

Tollywood Heroes Best Looks

స్టార్ హీరోలు నటించే సినిమాలలో అభిమానులు అన్ని విషయాలు గమనిస్తుంటారు. హీరో లుక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా హీరో లుక్ ఉంటే అక్కడి నుంచే సినిమాపై క్రేజ్ మొదలవుతుంది. ఆ విధంగా హీరోల లుక్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోల లుక్స్ బావున్నప్పటికీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పవన్, మహేష్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోల లుక్స్ కి మంచి క్రేజ్ వచ్చింది కానీ ఆ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పవన్ కళ్యాణ్ - పంజా
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ - పంజా

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ లుక్స్ లో పంజా మూవీ ముందు వరుసలో ఉంటుంది. అప్పటికి సరైన హిట్ లేక పవన్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. పంజాలో బియర్డ్ లుక్ బయటకి రాగానే ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంతా భావించారు. కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అభిమానుల ఆశలు ఆవిరి చేసింది.

37
మహేష్ బాబు - సర్కారు వారి పాట, ఖలేజా
Image Credit : Asianet News

మహేష్ బాబు - సర్కారు వారి పాట, ఖలేజా

మహేష్ బాబు అందంగా కనిపించని సినిమా అంటూ ఉండదు. అయినప్పటికీ కొన్ని బెస్ట్ లుక్స్ ఉండే సినిమాలు ఉంటాయి. సర్కారు వారి పాట మూవీలో ఉబెర్ కూల్ లుక్ లో మహేష్ కనిపించారు. సినిమా నిరాశ పరిచింది. ఖలేజా కూడా అంతే. ఆ మూవీలో మహేష్ చాలా స్టైలిష్ గా ఉంటారు. కానీ సంబంధం లేని కామెడీ కారణంగా ఆ చిత్రం ఫ్లాప్ అయింది.

47
జూ.ఎన్టీఆర్ - రామయ్య వస్తావయ్యా
Image Credit : Asianet News

జూ.ఎన్టీఆర్ - రామయ్య వస్తావయ్యా

జూనియర్ ఎన్టీఆర్ ని చాలా యంగ్ గా, స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్యాలో తారక్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి.

57
అల్లు అర్జున్ - ఇద్దరమ్మాయిలతో
Image Credit : Asianet News

అల్లు అర్జున్ - ఇద్దరమ్మాయిలతో

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో బన్నీ స్టైలిష్ లుక్స్ మైంటైన్ చేశారు. కానీ సినిమా చెప్పుదుకోదగ్గ విజయం సాధించలేకపోయింది.

67
రాంచరణ్ - బ్రూస్ లీ
Image Credit : Asianet News

రాంచరణ్ - బ్రూస్ లీ

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాంచరణ్ లుక్స్ క్రేజీగా ఉంటాయి. రాంచరణ్ బాడీ లాంగ్వేజ్ కూడా అంతే స్టైలిష్ గా మైంటైన్ చేశారు. హిట్ అవుతుంది అనుకున్న ఈ చిత్రం నిరాశ పరిచింది.

77
నాగార్జున - గ్రీకు వీరుడు
Image Credit : Asianet News

నాగార్జున - గ్రీకు వీరుడు

నాగార్జున ఏ మూవీలో అయినా సరే ఎంతో స్టైలిష్ గా ఉంటారు. గ్రీకు వీరుడు మూవీలో ఫ్రెంచ్ కట్ బియర్డ్ ట్రై చేసి ఇంకా అందంగా కనిపించారు. దీనితో ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మూవీ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Khalifa OTT: తండ్రిని జైలుపాలు చేసిన వాళ్లపై వారణాసి విలన్ రివేంజ్..ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్
Recommended image2
Bigg Boss Telugu 10 Voting: ఐదో వారం ఓటింగ్‌.. టాప్‌లో రోహిత్‌, కానీ డేంజర్‌లో ముగ్గురు, ఇద్దరు ఔట్‌
Recommended image3
Jason Sanjay: డైరెక్టర్‌గా ఫ్లాప్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
Related Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved