MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.09.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Sep 03 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

నూతన రుణ యత్నాలు అనుకూలించవు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. కీలక సమయంలో సోదరుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసిరావు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఉద్యోగులు ఒక వ్యవహారంలో అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved