MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !

WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !

WTC Standings 2025-27: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్ లో కొనసాగుతుండగా, శ్రీలంక పర్యటన తర్వాత భారత్ 5వ స్థానానికి పడిపోయింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ICC WTC ఫైనల్ చేరాలంటే ఇక అద్భుతం జరగాల్సిందేనా? టీమిండియా ముందున్న ఆఖరి దారులు ఇవే
Image Credit : bcci

ICC WTC ఫైనల్ చేరాలంటే ఇక అద్భుతం జరగాల్సిందేనా? టీమిండియా ముందున్న ఆఖరి దారులు ఇవే

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆగస్టు 2026 నాటికి జట్లు ఫైనల్ బెర్త్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో టేబుల్ టాప్‌లో ఉండగా, సౌతాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకతో ఇటీవల ముగిసిన 2 టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ, చివరి టెస్ట్ డ్రా కావడంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో జట్ల ప్రస్తుత పరిస్థితి గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాప్‌లో కంగారూలు.. సౌతాఫ్రికా జోరు
Image Credit : X/ICC

టాప్‌లో కంగారూలు.. సౌతాఫ్రికా జోరు

2023 డబ్ల్యూటీసీ విజేత అయిన ఆస్ట్రేలియా ఈ సైకిల్‌ను కూడా అదిరిపోయేలా ప్రారంభించింది. కారికోడ్ గ్రౌండ్స్‌లో వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఊహించని ఓటమి ఎదురైనప్పటికీ, మ్యాకేలో జరిగిన రెండో టెస్టులో గెలిచి 80 పాయింట్ల శాతంతో మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ 914 రన్స్ తో, మిచెల్ స్టార్క్ 58 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

మరోవైపు సౌతాఫ్రికా 75.00 పిసిటితో రెండో స్థానంలో ఉంది. భారత్ గడ్డపై ఏకంగా 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. టెంబా బవుమా కెప్టెన్సీలోని సఫారీ జట్టు ఇప్పటికే రెండు కఠినమైన పర్యటనలను విజయవంతంగా ముగించింది.

36
న్యూజిలాండ్ దంచుడు.. బంగ్లాదేశ్ సంచలన విజయం
Image Credit : Getty

న్యూజిలాండ్ దంచుడు.. బంగ్లాదేశ్ సంచలన విజయం

తొలి డబ్ల్యూటీసీ విజేత న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో (72.22 PCT) మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ను వారి స్వదేశంలోనే 2-1 తేడాతో ఓడించి రికార్డు కొట్టింది. న్యూజిలాండ్ తరఫున డెవాన్ కాన్వే 676 పరుగులు, జాకబ్ డఫీ 23 వికెట్లు తీశారు.

ఇక బంగ్లాదేశ్ ఈ సైకిల్‌లో దుమ్మురేపుతోంది. 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 55.56 పిసిటి సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించడమే కాకుండా, పాకిస్థాన్‌పై స్వదేశంలో విజయం సాధించి ఫైనల్ రేసులో నిలిచింది. నజ్ముల్ హొస్సేన్ శాంటో (647 పరుగులు), తైజుల్ ఇస్లాం (24 వికెట్లు) జట్టుకు హీరోలుగా మారారు.

46
5వ స్థానంలో భారత్.. పెరిగిన ఒత్తిడి
Image Credit : X/BCCI

5వ స్థానంలో భారత్.. పెరిగిన ఒత్తిడి

రెండుసార్లు డబ్ల్యూటీసీ రన్నరప్‌గా నిలిచిన భారత్ ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 51.52 పిసిటి సాధించి 5వ స్థానంలో ఉంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో 0-2తో ఓడిపోవడం భారత్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. గాలేలో జరిగిన తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ (167, 44), మానవ్ సుతార్ల ప్రతిభతో భారత్ 165 పరుగుల తేడాతో నెగ్గింది. కానీ కొలంబోలో జరిగిన రెండో టెస్టును సోనాల్ దినుషా అద్భుత బ్యాటింగ్‌తో శ్రీలంక డ్రాగా ముగించింది.

దీంతో భారత్ 1-0తో సిరీస్ గెలిచినా పూర్తి పాయింట్లు సాధించలేకపోయింది. ఈ సైకిల్‌లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ (1024 పరుగులు), మహమ్మద్ సిరాజ్ (43 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నారు. భారత్ ఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే రాబోయే సిరీస్‌లలో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే.

56
ఇంగ్లాండ్ ఆరో స్థానం.. శ్రీలంక పోరాటం
Image Credit : X/BCCI

ఇంగ్లాండ్ ఆరో స్థానం.. శ్రీలంక పోరాటం

ఇంగ్లాండ్ 15 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (34.44 PCT) 6వ స్థానంలో ఉంది. లీడ్స్, లార్డ్స్ లో పాకిస్థాన్‌పై వరుస విజయాలు సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జో రూట్ (1202 పరుగులు), జోష్ టంగ్ (57 వికెట్లు) రాణించినప్పటికీ, స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లు కోల్పోవడం ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది.

శ్రీలంక 6 మ్యాచ్‌ల్లో 1 విజయం (33.33 PCT)తో 7వ స్థానంలో నిలిచింది. కొలంబో టెస్టులో సోనాల్ దినుషా (606 పరుగులు) శతకంతో భారత్ ఆశలపై నీళ్లు చల్లి మ్యాచ్‌ను డ్రా చేయగలిగింది.

66
అడుగున వెస్టిండీస్, పాకిస్థాన్
Image Credit : Getty

అడుగున వెస్టిండీస్, పాకిస్థాన్

వెస్టిండీస్ 12 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో (20.83 PCT) 8వ స్థానంలో ఉంది. కెప్టెన్ రోస్టన్ చేజ్ నేతృత్వంలో రీబిల్డింగ్ దశలో ఉన్న విండీస్.. పాకిస్థాన్‌తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. షాయ్ హోప్ (792 పరుగులు), షమార్ జోసెఫ్ (35 వికెట్లు) విండీస్ తరఫున రాణిస్తున్నారు.

ఇక పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో (16.67 PCT) అట్టడుగున 9వ స్థానంలో పడిపోయింది. బాబర్ అజామ్ (453 పరుగులు) లేకపోవడం, ఇంగ్లాండ్ పర్యటనలో లీడ్స్, లార్డ్స్‌లో దారుణ ఓటములు పాక్‌ను బాగా దెబ్బతీశాయి. మహమ్మద్ అబ్బాస్ 28 వికెట్లతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image3
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved