MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?

Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?

Eggs: కోడి గుడ్డులో ఎప్పుడైనా రెండు సొనలు రావడం చూశారా? అలాంటి గుడ్లు అసలు తినొచ్చా? అసలు.. ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎలా సాధ్యం..? ఇలాంటి గుడ్లు అసలు మంచివేనా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 03 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కోడిగుడ్డు..
Image Credit : pinterest

కోడిగుడ్డు..

కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ కనీసం ఒక్క గుడ్డు అయినా తినాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే.. ఒక్కోసారి మనం గుడ్డు పగల కొట్టినప్పుడు.. ఒకటికి రెండు పచ్చ సొనలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా రెండు పచ్చ సొనలు కనిపించినప్పుడు.. మనకు ఏదో లక్కీ డిప్ తగిలింది... అని సంబరపడిపోతూ ఉంటాం. కానీ, ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు.. ఒక గుడ్డులో రెండు సొనలు ఎలా వస్తాయి? అలాంటి గుడ్లు మంచివేనా? కాదా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒకే గుడ్డులో రెండు సొనలు ఎలా వస్తాయి..?
Image Credit : Getty

ఒకే గుడ్డులో రెండు సొనలు ఎలా వస్తాయి..?

సాధారణంగా కోడి శరీరంలోని ప్రతి 30 నిమిషాలకు ఒక పసుపు సొన విడుదల అవుతుంది. అది ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ తెల్ల సొన, పెంకు ఏర్పడి గుడ్డుగా బయటకు వస్తుంది. అయితే, కొన్నిసార్లు కోడి శరీరం ఒకేసారి రెండు పచ్చ సొనలను విడుదల చేస్తుంది. అలా ఒకేసారి వచ్చిన ఆ రెండింటి చుట్టూ తెల్ల సొన, ఒకే పెండు కప్పుకోవడంతో.. ఇలా డబుల్ సొన గుడ్డు తయారౌతుంది.

ఎలాంటి కోడి.. ఇలాంటి గుడ్లు పెడుతుంది?

అన్ని రకాల కోళ్లు.. ఇలా డబుల్ సొన గుడ్లు పెట్టవు. కొత్తగా గుడ్లు పెట్టడం మొదలుపెట్టిన చిన్న కోళ్లలో హార్మోన్లు సరిగ్గా ఉండవు. అందుకే... ఇవి ఒకేసారి రెండు సొనలను విడుదల చేస్తాయి. అంతేకాదు, కొన్ని జాతి కోళ్లకు పుట్టుకతోనే డబుల్ సొన గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. కోడి గుడ్లు పెట్టే సమయాల్లో తేడాలు వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.

33
ఒక గుడ్డులో ఎన్ని సొనలు ఉండొచ్చు?
Image Credit : Geminiai

ఒక గుడ్డులో ఎన్ని సొనలు ఉండొచ్చు?

వరల్డ్ రికార్డ్: 1971లో న్యూయార్క్‌లో ఒకే గుడ్డులో ఏకంగా 9 పసుపు సొనలు బయటపడ్డాయి. గిన్నిస్ బుక్‌లో నమోదైన అత్యధిక రికార్డ్ ఇదే. కొన్నిసార్లు అస్సలు పసుపు సొనే లేని ఖాళీ గుడ్లు కూడా వస్తాయి. కొత్త కోళ్లు తొలిసారి గుడ్లు పెట్టేటప్పుడు ఇలా జరుగుతుంది.

ఇలాంటి గుడ్లు తినడం సురక్షితమేనా? 

చాలా మంది ఇలాంటి గుడ్లు తినడానికి భయపడిపోతారు. కానీ, ఇవి తినడానికి 100% సురక్షితం. ఆమ్లెట్లు, హాఫ్ బాయిల్స్ లేదా స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఒకే గుడ్డులో రెండు సొనలు ఉండటం వల్ల సాధారణ గుడ్డు కంటే వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, మంచి కొవ్వులు కాస్త ఎక్కువే లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు
Recommended image2
River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?
Recommended image3
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Related Stories
Recommended image1
Dosa: దోశ పెనానికి అతుక్కుపోతోందా? ఇదొక్కటి చేస్తే.. హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే..!
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved