Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Curd: పెరుగు ఎంత జాగ్రత్తగా తోడేసినా కూడా... నీళ్లలా మారిపోతోందా? గడ్డలాగా తోడుకోవడం లేదా? అయితే.. సింపుల్ అమ్మమ్మల నాటి చిట్కా ఫాలో అయితే.. పెరుగు గడ్డలా మారుతుంది.

Curd
ఈ రోజుల్లో ఎంత ఖరీదైన పాలు కొన్నా, చుక్క నీరు కూడా కలపకపోయినా కూడా.. పెరుగు మాత్రం నీళ్ల లానే ఉంటుంది. కానీ, మన అమ్మమ్మల నాటి కాలంలో... ఎలాంటి ఫ్రిజ్ లు లేకపోయినా, పెరుగు మాత్రం కేక్ లాగా గట్టిగా, గడ్డలా వచ్చేది. మీకు కూడా ఇప్పుడు అలాంటి పెరుగు తినాలి అని ఉంటే.. సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. కొన్ని ఆకులను వేయడం వల్ల.. పెరుగు మీకు నచ్చినట్లుగా గట్టిగా తోడుకుంటుంది. రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
పచ్చి మిర్చి..
పచ్చి మిర్చి కాడతో.. పెరుగు గట్టిగా తోడుకుంటుంది. దీని కోసం, గోరు వెచ్చని పాలలో తోడు వేసే పెరుగుతో పాటు.. 2 పచ్చి మరిపకాయలను తొడెంతో సహా వేయాలి. మిర్చీ మరీ కాస్త ఎక్కువ ఘాటుు ఉంటుంది అనుకుంటే.. దానిని తుంచి.. కాడ ఉన్న భాగాన్ని పాలలో మునిగేటట్లు వేస్తే సరిపోతుంది. పచ్చి మిర్చీ కాడలో సస్పెన్సరీ ఎంజైమ్ లు, సహజమైన ల్యాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి పాలను గట్టిపడేలా చేస్తాయి. మిరపకాయ వేశాం కదా..పెరుగు ఏమైనా కారంగా ఉంటుందా అని భయపడాల్సిన అవసరం లేదు. పెరుగు రుచి ఘాటుగా ఏమీ ఉండదు. ఇక.. పెరుగు తోడుకున్న తర్వాత... ఆ కాయను తీసేస్తే సరిపోతుంది.
తమలపాకు...
పాలు తోడు పెట్టే సమయంలో బాగా కడిగిన తమలపాకును కాడతో సహా పాల పైభాగంలో ఉంచి మూత పెట్టాలి. తమలపాకు పాలలో ఉన్న అధిక తేమను అదుపు చేయడమే కాకుండా, పెరుగు త్వరగా పుల్లబడకుండా కాపాడుతుంది. దీనివల్ల పెరుగు గట్టిగా రావడంతో పాటు తియ్యటి, సువాసనతో కూడిన రుచి వస్తుంది.
3. రావి ఆకు
పూర్వం చాలా మంది పాలు తోడు వేయడానికి పెరుగు అందుబాటులో లేకపోతే.. ఆకు లేదా మర్రి ఆకు కాడను శుభ్రం చేసి గోరువెచ్చని పాలల్లో ముంచి రాత్రంతా ఉంచేవారు. ఉదయానికి పాలు చక్కటి గడ్డ పెరుగుగా మారేవి. ఈ ఆకుల్లో ఉండే సహజ ప్లాంట్ ఎంజైమ్‌లు పాలను పెరుగుగా మారుస్తాయి.
వేపాకు..
వేసవి కాలంలో పెరుగు త్వరగా నీరైపోయి, పుల్లగా మారిపోతుంటుంది. అలా కాకుండా ఉండటానికి తోడు పెట్టిన పాత్రలో ఒక చిన్న వేపాకు కాడను వేసేవారు. ఇది పెరుగును ఎక్కువ సమయం తాజాగా, గట్టిగా ఉంచుతుంది.
ఈ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి...
మట్టి పాత్రే అసలు మంత్రం: గాజు లేదా స్టీలు పాత్రల కంటే మట్టి కుండలో ఈ ఆకుల చిట్కా వాడితే ఫలితం రెట్టింపు అవుతుంది. మట్టి పాత్ర నీటిని పీల్చుకోవడంతో పెరుగు గట్టిగా మారుతుంది.
కదల్చకూడదు: తోడు వేసి ఆకు వేసిన తర్వాత ఆ పాత్రను 6 నుండి 8 గంటల పాటు అస్సలు కదల్చకుండా ఒక మూలన ఉంచాలి.
పాల వెచ్చదనం: పాలు వేలు ముంచితే కాస్త వెచ్చగా ఉండాలి అంటే..గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ చిట్కాలు పనిచేస్తాయి.
తోడు పెరుగు సరిగ్గా లేనప్పుడు లేదా పెరుగు కేక్ లాగా రావాలనుకున్నప్పుడు ఈ అమ్మమ్మల నాటి సహజమైన చిట్కాలు మీరు కూడా ట్రై చేసి చూడండి..

