MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?

స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?

ఇంట్లో వేడుకలుంటే చాలు స్వీట్లు కనిపించాల్సిందే. కొన్ని రకాల లడ్డూలు, కోవా స్వీట్లపై వెండి రేకు మెరుస్తూ కనిపిస్తుంది. దీన్నే 'సిల్వర్ వర్క్' అంటారు. దీన్ని నిజానికి తినేయవచ్చు. కానీ అది స్వచ్ఛమైనది కాకపోతే సమస్యే.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 03 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అసలు ఏమిటీ సిల్వర్ పూత?
Image Credit : chatgpt

అసలు ఏమిటీ సిల్వర్ పూత?

స్వీట్ షాపులకు వెళితే కొన్ని స్వీట్లపై వెండిలా మెరుస్తున్న పొర కనిపిస్తుంది. అదే 'సిల్వర్ వర్క్'. దీన్ని స్వీట్లపై చాలా పలుచని వెండి పొరలా పూస్తారు. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? తింటే ఏమవుతుంది? అనే విషయాలు చాలామందికి తెలీదు.

ఇది తినడానికి వీలైన, చాలా పలుచని వెండి పూత. దీని మందం ఒక మైక్రోమీటర్ కన్నా తక్కువ ఉంటుంది. దీనికి ఎలాంటి రుచి గానీ, వాసన గానీ ఉండదు. స్వీట్లను అందంగా, నోరూరించేలా కనిపించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మన దేశంలో మొఘలుల కాలం నుంచే ఈ సంప్రదాయం ఉందని చెబుతారు. అప్పట్లో రాజకుటుంబ వైభవాన్ని, ఆతిథ్యాన్ని చాటేందుకు స్వీట్లపై వెండి, బంగారు పూతలు వాడేవారు. ఆ అలవాటు ఇంకా అలా కొన్ని చోట్ల కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇది శాకాహారమా లేక మాంసాహారమా?
Image Credit : pexels

ఇది శాకాహారమా లేక మాంసాహారమా?

పాతకాలంలో వెండిని పలుచని రేకుగా మార్చడానికి, జంతువుల (ఎక్కువగా ఎద్దు లేదా మేక) ప్రేగులు లేదా చర్మం పొరల మధ్య పెట్టి సుత్తితో కొట్టేవారు. ఈ కారణంగా చాలామంది శాకాహారులు దీన్ని తినడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం, సిల్వర్ వర్క్ తయారీలో జంతు సంబంధిత పదార్థాలను వాడకూడదు. ఇప్పుడు ఆధునిక యంత్రాలతో పూర్తిగా శాకాహార పద్ధతిలోనే దీన్ని తయారు చేస్తున్నారు.
33
తింటే ప్రమాదం లేదా?
Image Credit : pexels

తింటే ప్రమాదం లేదా?

మీరు తినే సిల్వర్ వర్క్ 99.9% స్వచ్ఛమైన 'ఫుడ్ గ్రేడ్' వెండి అయితే దాన్ని తక్కువ మోతాదులో తినడం వల్ల ఏం కాదు. ఇది మన జీర్ణవ్యవస్థలో కలిసిపోదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. కానీ లాభం కోసం కొంతమంది తయారీదారులు వెండికి బదులు అల్యూమినియం ఫాయిల్ లేదా ఇతర కల్తీ లోహాలను వాడుతున్నారు. అలాంటప్పుడు వాటిని తినడం మాత్రం మంచిది కాదు.

అసలైన వెండి రేకును చేత్తో తాకగానే సులువుగా చిరిగిపోయి, చేతికి అంటుకుంటుంది. అదే అల్యూమినియం ఫాయిల్ అయితే గట్టిగా ఉంటుంది. వేలితో నలిపితే చిన్న ఉండలా మారిపోతుంది. ఇలా మీ స్వీట్లపై ఉన్నది వెండా? లేక అల్యూమినియం? అనేది కనిపెట్టాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు
Recommended image2
River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?
Recommended image3
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Related Stories
Recommended image1
Rice: అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకాలంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి చాలు
Recommended image2
విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved