MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!

Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!

Utensils: వంట చేస్తుంటే.. అప్పుడప్పుడు పొరపాటు గిన్నెలు అడుగు మాడిపోతూ ఉంటాయి. అలా మాడిన గిన్నెలను శుభ్రం చేయడం అంత సులువు కాదు. కానీ, ఎక్కువ శ్రమ లేకుండా వాటిని శుభ్రం చేసే చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 02 2026, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మాడిపోయిన గిన్నెలు ఈజీగా క్లీన్ చేసే పద్దతి..
Image Credit : Geminiai

మాడిపోయిన గిన్నెలు ఈజీగా క్లీన్ చేసే పద్దతి..

వేడి నీళ్లు, డిష్ వాష్ సోప్ లిక్విడ్ తో మొండి మరకలను ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం, పాన్ కొద్దిగా చల్లారిన తర్వాత, చెక్క గరిటెతో పైన ఉన్న మాడిన ఆహారాన్ని తీసేయండి. ఆ తర్వాత మాడిన భాగానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ వేసి స్టవ్ మీద 10-15 నిమిషాలు మరిగించండి. వేడి నీరు, సబ్బు కలిసి మాడిన పొరను మెత్తగా చేస్తాయి. స్టవ్ ఆపి చల్లారాక మెత్తటి స్పాంజితో తుడిస్తే మరకలు సులభంగా ఊడిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
2. బేకింగ్ సోడా పేస్ట్
Image Credit : Facebook YouTube

2. బేకింగ్ సోడా పేస్ట్

మొండిగా మారిన నల్లటి పొరను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయం చేస్తుంది. దీని కోసం, మాడిన ప్రాంతంలో బేకింగ్ సోడాను ఎక్కువగా చల్లి, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. దీనిని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా పాత్రకు గీతలు పడకుండానే మాడిన పదార్థాన్ని వదిలిస్తుంది. ఆ తర్వాత నైలాన్ బ్రష్ లేదా స్పాంజితో రుద్దితే సరిపోతుంది.

3. వెనిగర్, బేకింగ్ సోడా కాంబో..

స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలపై ఉన్న మొండి మాడు మరకలకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాన్ నిండేలా సగం నీరు, సగం వైట్ వెనిగర్ పోసి స్టవ్‌పై మరిగించి దించేయండి. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, పాన్‌లో బేకింగ్ సోడా చల్లండి. వెనిగర్, బేకింగ్ సోడా కలిస్తే నురుగు వస్తుంది. దీంతో.. తర్వాత ఈజీగా ఆ మొండి మరకలు వదులుతాయి.

33
4. రాత్రి పూట నానబెట్టడం
Image Credit : Facebook YouTube

4. రాత్రి పూట నానబెట్టడం

గిన్నె మాడిన వెంటనే శుభ్రం చేయడానికి సమయం లేకపోతే. మీరు రాత్రంతా నానపెట్టి.. మరుసటి రోజు శుభ్రం చేయచ్చు.. దీనికోసం, మాడిన పాత్రలో వేడి నీళ్లు, కొద్దగా డిష్ సోప్ వేసి.. రాత్రంతా నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే శుభ్రం చేస్తే.. సులభంగా మాడు పోతుంది. మీ పాత్రలు మళ్లీ కొత్త వాటిలా కనిపిస్తాయి.

5. నాన్-స్టిక్ పాత్రలు మాడితే..

నాన్-స్టిక్ లేదా కోటింగ్ ఉన్న పాత్రలు మాడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని శుభ్రం చేయడానికి స్టీల్ స్క్రబ్బర్లు, కత్తులు లేదా పదునైన వస్తువులు అస్సలు వాడకూడదు. కేవలం గోరువెచ్చని నీరు, డిష్‌వాష్ సబ్బు మెత్తటి స్పాంజిని మాత్రమే ఉపయోగించి క్లీన్ చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు
Recommended image2
River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?
Recommended image3
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Related Stories
Recommended image1
Dosa: దోశ పెనానికి అతుక్కుపోతోందా? ఇదొక్కటి చేస్తే.. హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే..!
Recommended image2
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved