MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !

Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !

Gold: రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ఇన్వెస్టర్ల భవిష్యత్తుపై మరోసారి కీలక హెచ్చరికలు చేశారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందన్నారు. బంగారం, వెండి మాత్రమే కాపాడతాయని చెప్పారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 31 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పేపర్ మనీ వేస్ట్.. రియల్ మనీతోనే ఫ్యూచర్ భద్రం
Image Credit : Chatgpt

పేపర్ మనీ వేస్ట్.. రియల్ మనీతోనే ఫ్యూచర్ భద్రం

ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, ప్రపంచ ప్రఖ్యాత 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం, కేవలం కష్టపడి పనిచేసి జీతంపై ఆధారపడటం అనే సంప్రదాయ ఆర్థిక సలహాలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కాగితపు కరెన్సీని ముద్రించడం వల్ల రోజురోజుకూ డబ్బు విలువ పడిపోతోందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రూపాయి లేదా డాలర్ వంటి కాగితపు నోట్లపై ఆధారపడకుండా, రియల్ మనీ అయిన బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల్లో పొదుపు చేయడమే అత్యంత సురక్షితమైన మార్గమని స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
$4.5 లక్షల బంగారంతో $4.5 మిలియన్ల ఇల్లు
Image Credit : Pixabay

$4.5 లక్షల బంగారంతో $4.5 మిలియన్ల ఇల్లు

తన సిద్ధాంతం ఎంతవరకు నిజమో నిరూపించేందుకు రాబర్ట్ కియోసాకి ఒక అద్భుతమైన ఉదాహరణను పంచుకున్నారు. తాను ఇటీవల 4.5 మిలియన్ డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు ₹40 కోట్లకు పైగా) విలువ చేసే ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే, అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయడానికి ఆయన రూపాయి కూడా బ్యాంకు ఖాతా నుంచి చెల్లించలేదు. ఏళ్ల తరబడి తాను పొదుపు చేసిన బంగారు నాణేలనే ఇందుకు ఉపయోగించారు. అప్పట్లో తాను కేవలం 4.5 లక్షల డాలర్లతో కొనుగోలు చేసిన బంగారంతోనే, ఇప్పుడు ఏకంగా పదింతల విలువైన 45 లక్షల డాలర్ల ఇల్లు సొంతమైందని వివరించారు.

35
వెండి డాలరుగా ఉన్నప్పుడే కొన్నా.. పెరిగిన రేట్ల జోరు
Image Credit : X-@theRealKiyosaki

వెండి డాలరుగా ఉన్నప్పుడే కొన్నా.. పెరిగిన రేట్ల జోరు

ఇది ఎలాంటి ఫోర్‌క్లోజర్‌ లేదా స్పెషల్ డీల్‌ కాదని, కేవలం పసిడి విలువ పెరగడం వల్లే తనకు ఈ లాభం సమకూరిందని కియోసాకి స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 45 డాలర్లు, బంగారం ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. కానీ తాను వెండిని ఔన్సుకు కేవలం ఒక్క డాలర్‌ ఉన్న సమయం నుంచే కొనుగోలు చేయడం ప్రారంభించానని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడే శక్తి బంగారం, వెండికి మాత్రమే ఉందనడానికి ఇదే సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

45
గడిచిన 10 ఏళ్లలో బంగారం, వెండి ధరల జర్నీ ఇదే
Image Credit : Pixabay

గడిచిన 10 ఏళ్లలో బంగారం, వెండి ధరల జర్నీ ఇదే

అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పారిశ్రామిక డిమాండ్ కారణంగా గడిచిన పదేళ్ల కాలంలో పసిడి, వెండి ధరలు అసాధారణ రీతిలో పెరిగాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: 2016లో కేవలం ₹28,500 - ₹30,000 మధ్య ఉన్న పసిడి ధర, 2020 కోవిడ్ సమయంలో ₹50,000 మార్కును దాటింది. ఆ తర్వాత భౌగోళిక ఉద్రిక్తతల వల్ల 2024 నాటికి ₹75,000 దాటి, ప్రస్తుతం 2026లో ఏకంగా ₹1,60,000 పైచిలుకు స్థాయికి చేరుకుంది. అంటే గత పదేళ్లలో లభించిన రాబడి సుమారు 400% పైమాటే.

వెండి 1 కిలోగ్రాము: 2016లో ₹38,000 - ₹42,000గా ఉన్న కిలో వెండి ధర.. సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం 2026లో ఏకంగా ₹2,60,000 మైలురాయిని తాకింది. దీనిపై గత 10 ఏళ్లలో దాదాపు 500% కి పైగా లాభం నమోదైంది.

55
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరల పరిస్థితి ఇదే
Image Credit : Asianet News

ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరల పరిస్థితి ఇదే

దేశవ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. స్థానిక పన్నులు, రవాణా వ్యయాల ఆధారంగా తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో ప్రస్తుతం నమోదైన ధరలు గమనిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర సుమారు రూ.1,56,770 కాగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,700 గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹1,17,580 వద్ద ట్రేడ్ అవుతోంది.

అదేవిధంగా విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,770 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,43,700గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర ₹1,20,967 గా ఉంది. మరోవైపు, పారిశ్రామిక రంగా నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో రెండు నగరాల్లోనూ కిలో వెండి ధర ఏకంగా ₹2,60,000 మార్కును తాకింది. ఈ ధరలన్నీ బేస్ అంచనా మాత్రమే, వీటిపై 3% GST, జ్యువెలర్స్ మేకింగ్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి.

ఫ్యూచర్ సేవింగ్స్ విషయంలో కాగితపు నోట్లపై మాత్రమే ఆధారపడకుండా, గోల్డ్, సిల్వర్ వంటి రియల్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థిక భద్రత సాధించవచ్చని రాబర్ట్ కియోసాకి అనుభవంతో చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
హైదరాబాద్
తెలంగాణ
భారత దేశం
వ్యాపారం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Recommended image2
వందే భార‌త్ రైలు కిలోమీట‌ర్ న‌డిస్తే.. ఎంత విద్యుత్ ఖ‌ర్చ‌వుతుందో తెలుసా.?
Recommended image3
అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ తేదీ ప్ర‌క‌ట‌న‌.. ఈ కార్డుల‌తో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్
Related Stories
Recommended image1
Mosquito Repellent Plants: వర్షాకాలంలో దోమల బెడదకు చెక్ పెట్టే అద్భుతమైన ఇండోర్ మొక్కలు ఇవే
Recommended image2
IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved