MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ

IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ

IRCTC Godavari Temple Tour: ఐఆర్‌సీటీసీ 3 రాత్రులు, 4 రోజుల గోదావరి టెంపుల్ ప్యాకేజీని ప్రారంభించింది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామ దర్శనం కోసం తీసుకొచ్చిన ఈ సూపర్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 30 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అన్నవరం నుంచి ద్రాక్షారామం వరకు.. IRCTC గోదావరి ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే
Image Credit : Gemini

అన్నవరం నుంచి ద్రాక్షారామం వరకు.. IRCTC గోదావరి ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే

ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ భక్తుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. "గోదావరి టెంపుల్ టూర్" (ప్యాకేజీ కోడ్: SHR029) పేరుతో 3 రాత్రులు, 4 రోజుల ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా అన్నవరం, కోనసీమ, రాజమండ్రి, అంతర్వేది, పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం వంటి శక్తివంతమైన దివ్య క్షేత్రాలను సందర్శించవచ్చు.

ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాస స్థలం. ఈ క్షేత్రంలో కొలువైన భీమేశ్వర స్వామి పంచారామాలలో అత్యంత శక్తివంతమైన శివుని రూపంగా భావిస్తారు. ప్రతి శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, టికెట్ ధరలు, రూల్స్ వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐఆర్‌సీటీసీ గోదావరి టూర్ షెడ్యూల్ ఇదే
Image Credit : ANI

ఐఆర్‌సీటీసీ గోదావరి టూర్ షెడ్యూల్ ఇదే

ఐఆర్‌సీటీసీ గోదావరి టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు ఏసీ వాహనాల్లో స్థానిక క్షేత్రాల సందర్శన సౌకర్యాన్ని కల్పించారు.

డే 1 (శుక్రవారం): లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 20:30 గంటలకు, సికింద్రాబాద్ నుంచి రాత్రి 21:15 గంటలకు రైలు నంబర్ 12738 (గౌతమి ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రికి రైలులోనే ప్రయాణం ఉంటుంది.

డే 2 (శనివారం): ఉదయం 04:38 గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి ఫ్రెషప్ అయిన తర్వాత అన్నవరం ప్రయాణమవుతారు. సాయంత్రం తిరిగి రాజమండ్రి వచ్చి గోదావరి ఘాట్, ఇస్కాన్ టెంపుల్ సందర్శిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే బస ఉంటుంది.

డే 3 (ఆదివారం): హోటల్ చెకౌట్ చేసి అంతర్వేది బయలుదేరుతారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, బీచ్‌ను సందర్శిస్తారు. అనంతరం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయం, ఐనవిల్లి విఘ్నేశ్వర ఆలయం, ద్రాక్షారామం ఆలయాన్ని దర్శిస్తారు. సాయంత్రం రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో రాత్రి 20:18 గంటలకు రైలు నంబర్ 12737 (గౌతమి ఎక్స్‌ప్రెస్) ఎక్కుతారు.

డే 4 (సోమవారం): ఉదయం 04:35 గంటలకు సికింద్రాబాద్, 05:55 గంటలకు లింగంపల్లి చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.

35
ఐఆర్‌సీటీసీ గోదావరి టూర్ ప్యాకేజీ ఛార్జీలు
Image Credit : ANI

ఐఆర్‌సీటీసీ గోదావరి టూర్ ప్యాకేజీ ఛార్జీలు

ఈ ప్యాకేజీ ధరలు ప్రయాణికుల సంఖ్య, కేటగిరీ ఆధారంగా ఉంటాయి.

ఒకరి నుంచి ముగ్గురు ప్రయాణికులు:

• కంఫర్ట్ (3AC): సింగిల్ షేరింగ్ రూ. 15,400, ట్విన్ షేరింగ్ రూ. 8,990, ట్రిపుల్ షేరింగ్ రూ. 7,230. చైల్డ్ విత్ బెడ్ (5-11 ఏళ్లు) రూ. 6,140, చైల్డ్ విత్ అవుట్ బెడ్ (5-11 ఏళ్లు) రూ. 5,020.

• స్టాండర్డ్ (SL): సింగిల్ షేరింగ్ రూ. 13,840, ట్విన్ షేరింగ్ రూ. 7,430, ట్రిపుల్ షేరింగ్ రూ. 5,670. చైల్డ్ విత్ బెడ్ రూ. 4,580, చైల్డ్ విత్ అవుట్ బెడ్ రూ. 3,460.

నలుగురి నుంచి ఆరుగురు ప్రయాణికులకు (గ్రూప్):

• కంఫర్ట్ (3AC): ట్విన్ షేరింగ్ రూ. 7,490, ట్రిపుల్ షేరింగ్ రూ. 6,680. చైల్డ్ విత్ బెడ్ రూ. 6,140, చైల్డ్ విత్ అవుట్ బెడ్ రూ. 5,020.

• స్టాండర్డ్ (SL): ట్విన్ షేరింగ్ రూ. 5,930, ట్రిపుల్ షేరింగ్ రూ. 5,120. చైల్డ్ విత్ బెడ్ రూ. 4,580, చైల్డ్ విత్ అవుట్ బెడ్ రూ. 3,460.

45
ఐఆర్‌సీటీసీ గోదావరి టూర్ రూల్స్ ఇవే
Image Credit : Asianet News

ఐఆర్‌సీటీసీ గోదావరి టూర్ రూల్స్ ఇవే

మొత్తం సీట్ల కోటాలో స్లీపర్ నాన్-ఏసీ 06, 3AC 06 సీట్లు అందుబాటులో ఉంటాయి. హోటల్ చెక్-ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటలు. ఆన్‌లైన్ టిక్కెట్‌లు ప్రయాణానికి 4 రోజుల ముందు జారీ అవుతాయి. సీట్ల కేటాయింపు సెంట్రలైజ్డ్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి బెర్త్ మార్పులు కుదరవు. రైలు ఆలస్యం లేదా ప్రయాణికుల నిర్లక్ష్యం వల్ల దర్శనం/సేవలు కోల్పోతే ఐఆర్‌సిటిసి బాధ్యత వహించదు.

55
క్యాన్సిలేషన్ నిబంధనలు
Image Credit : ANI

క్యాన్సిలేషన్ నిబంధనలు

టికెట్ రద్దు చేయాలనుకుంటే www.irctctourism.com వెబ్‌సైట్ ద్వారా మాత్రమే రద్దు చేసుకోవాలి. ప్రయాణానికి 15 రోజుల ముందు రద్దు చేస్తే రూ. 250 మినహాయిస్తారు. 8-14 రోజుల ముందు రద్దు చేస్తే 25%, 4-7 రోజుల ముందు రద్దు చేస్తే 50% రుసుము కట్ చేస్తారు. 4 రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు. బుకింగ్ కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు లేదా 8287932229 / 8287932228 / 9701360701 ఫోన్ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Unique Temples : దేవుళ్లకు నైవేద్యంగా మందు, మటన్, చేపలు.. భక్తులకూ ఇవే ప్రసాదం.. ఎక్కడో తెలుసా?
Recommended image2
Telugu Saying: లోకువ మొగుడికి నూకల జావ! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Recommended image3
గాలి నుంచి కరెంట్ ఎలా తయారవుతుంది.? విండ్ టర్బైన్ వెనుక అసలు ప్రాసెస్ ఇదే
Related Stories
Recommended image1
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Recommended image2
Mosquito Repellent Plants: వర్షాకాలంలో దోమల బెడదకు చెక్ పెట్టే అద్భుతమైన ఇండోర్ మొక్కలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved