MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ తేదీ ప్ర‌క‌ట‌న‌.. ఈ కార్డుల‌తో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ తేదీ ప్ర‌క‌ట‌న‌.. ఈ కార్డుల‌తో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్

Amazon Great Indian Festival 2026: ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని ర‌కాల ప్రొడ‌క్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ల‌ను ప్ర‌క‌టించారు.

3 Min read
Author : Narender Vaitla
Published : Sep 20 2026, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్ప‌టినుంచంటే
Image Credit : Amazon.in

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్ప‌టినుంచంటే

అమెజాన్ ప్రకటించిన వివరాల ప్రకారం.. 2026 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. పండుగల సమయంలో వినియోగదారులకు తక్కువ ధరలకు వస్తువులను అందించడమే ఈ సేల్ ప్రధాన ఉద్దేశం. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, కిచెన్ సామగ్రి, గృహోపకరణాలు, హోమ్ డెకర్, నిత్యావసర వస్తువులపై ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంటాయి. ప్రముఖ బ్రాండ్ల నుంచి కొత్త ఉత్పత్తుల విడుదలతో పాటు, ఎంపిక చేసిన వస్తువులపై ఏడాదిలోనే అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అమెజాన్ తెలిపింది. అయితే ఏయే ఉత్పత్తులపై ఎంత తగ్గింపు ఉంటుందనే పూర్తి వివరాలను సేల్ సమయంలో వెల్లడించే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎస్‌బీఐ కార్డులతో 10 శాతం డిస్కౌంట్..
Image Credit : our own

ఎస్‌బీఐ కార్డులతో 10 శాతం డిస్కౌంట్..

ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా వినియోగదారులకు ఉపయోగపడనున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అర్హత కలిగిన ఈఎంఐ లావాదేవీలపైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎంపిక చేసిన ఆఫర్లపై అదనంగా 10 శాతం వరకు తగ్గింపు లభించనుంది. దీంతో అర్హత కలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు మరింత ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, పాత వస్తువులను ఇచ్చి కొత్తవి కొనుగోలు చేసే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే బ్యాంక్ ఆఫర్లకు సంబంధించిన అర్హతలు, గరిష్ఠ తగ్గింపు పరిమితులు, ఇతర నిబంధనలను కొనుగోలు చేసే ముందు పరిశీలించడం మంచిది.

35
స్మార్ట్ షాపింగ్ కోసం ఏఐ ఫీచర్లు.. ప్రత్యేక డీల్స్
Image Credit : AI meta

స్మార్ట్ షాపింగ్ కోసం ఏఐ ఫీచర్లు.. ప్రత్యేక డీల్స్

ఈసారి సేల్‌లో వినియోగదారులు సులభంగా షాపింగ్ చేసేందుకు అమెజాన్ పలు సదుపాయాలను అందిస్తోంది. ఉత్పత్తుల ధరలను పోల్చడం, గతంలో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం, తమకు అవసరమైన వస్తువులపై సూచనలు పొందడం వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీంతో ఒకే రకమైన ఉత్పత్తుల్లో ధరలు, ఫీచర్లు పోల్చుకుని కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు. సేల్ సమయంలో.. బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్, బై మోర్ సేవ్ మోర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ మేళా, శాంపిల్ మేనియా, అమెజాన్ కాంబో ఆఫర్లు వంటి ప్రత్యేక డీల్స్ కూడా ఉండనున్నాయి. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాత వస్తువులను ఇచ్చి కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

45
డెలివరీ నెట్‌వర్క్ విస్తరణ.. 1.60 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు
Image Credit : X

డెలివరీ నెట్‌వర్క్ విస్తరణ.. 1.60 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు

పండుగల సీజన్‌లో పెరిగే ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు అమెజాన్ తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు, 6 కొత్త సార్టింగ్ కేంద్రాలు, 150 కొత్త చివరి దశ డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విస్తరణలో భాగంగా తన కార్యకలాపాల నెట్‌వర్క్‌లో 1,60,000కు పైగా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించింది. ఈ నెట్‌వర్క్ సుమారు 400 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

అమెజాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 17 లక్షలకు పైగా విక్రేతలకు ఈ ప్లాట్‌ఫామ్ సేవలు అందిస్తోంది. గత ఏడాదిలో 3 లక్షలకు పైగా కొత్త విక్రేతలు చేరడంతో మొత్తం విక్రేతల సంఖ్య 20 లక్షలు దాటింది.

డెలివరీ వేగం విషయానికి వస్తే.. కొన్ని వస్తువులను నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లోనే అందించే సదుపాయం ఉంది. 10 లక్షలకు పైగా ఉత్పత్తులను అదే రోజు, 40 లక్షలకు పైగా ఉత్పత్తులను మరుసటి రోజు డెలివరీ చేసే సామర్థ్యం తమకు ఉందని అమెజాన్ పేర్కొంది. ప్రైమ్ సభ్యులకు అర్హత కలిగిన వస్తువులపై ఉచిత డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

55
వ‌రంగ‌ల్‌ సహా 100 నగరాలకు అమెజాన్ నౌ సేవలు..
Image Credit : Asianet News

వ‌రంగ‌ల్‌ సహా 100 నగరాలకు అమెజాన్ నౌ సేవలు..

పండుగల సందర్భంగా నిత్యావసర వస్తువులను త్వరగా అందించేందుకు అమెజాన్ నౌ సేవలను కూడా విస్తరిస్తోంది. దీపావళికి ముందు ఈ సేవలను 100 నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

జలంధర్, తిరుపతి, వరంగల్, ధార్వాడ్, వెల్లూరు, బెర్హంపూర్ వంటి నాన్-మెట్రో నగరాల్లోనూ అమెజాన్ నౌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవ ద్వారా కిరాణా సరుకులు, తాజా పండ్లు, కూరగాయలు, డ్రింక్స్‌, గృహోపకరణాలు, ప‌ర్స‌న‌ల్ కేర్ ప్రొడ‌క్ట్స్‌, బ్యూటీ ఉత్పత్తులు, చిన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటి వాటిని ఆర్డర్ చేయవచ్చు.

ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ భారతీయ పండుగల స్ఫూర్తిని ప్రతిబింబించే షాపింగ్ వేడుక అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వినియోగదారులకు విస్తృతమైన ఉత్పత్తుల ఎంపిక, ఏడాదిలోనే అతి తక్కువ ధరలు, ప్రత్యేక డీల్స్, కొత్త ఉత్పత్తులను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
బాగా ఉన్నోళ్లే కాదు మ‌నం కూడా డిష్ వాషర్ కొనుక్కోవచ్చు.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫ‌ర్
Recommended image2
Inspiring Story: అమ్మమ్మ జ్ఞాపకాలతో మొదలైన వ్యాపారం..ఇప్పుడు రూ.580 కోట్ల బ్రాండ్
Recommended image3
Indian Railway: రైలు పట్టాలపై క‌నిపించే రాళ్లు.. మెట్రో ట్రాక్‌పై ఎందుకు ఉండ‌వో తెలుసా.?
Related Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుంది.? రైళ్ల‌లో ఉండే ఇసుక బాక్సుల ప‌ని ఏంటి.?
Recommended image2
ఇక ప్రింట్ అవుట్స్ కోసం.. దుకాణానికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. స‌రికొత్త ప్రింట‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved