సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, పలువురు సినీ తారలపై ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి ఇటీవల సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ పై సంచలన కామెంట్స్ 
చేసింది. అతడొక కామ పిశాచి అన్నట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యలు షాక్ కి గురి చేశాయి. 

మహిళా ఆర్టిస్టులను వేధిస్తాడని, అతడి కారణంగా ఓ హీరోయిన్ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 'మా' అసోసియేషన్ నుండి ఆరు నెలల్లో ఎందుకు బయటకి వచ్చేశారో అందరికీ తెలుసునని ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారాన్ని రేపాయి.

తాజాగా ఈ విషయంపై స్పందించాడు నటుడు రాజేంద్రప్రసాద్. శ్రీరెడ్డి తనను ఎందుకు అపార్ధం చేసుకుందో.. అర్ధం కావడం లేదని అన్నారు. ''నేనెప్పుడూ శ్రీరెడ్డి గురించి ప్రస్తావించలేదు. ఆమెని విమర్శించలేదు.

నిజం చెప్పాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆమెని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. అలాంటిది ఆమె నన్ను ఎందుకు అపార్ధం చేసుకుందో.. అర్ధం కావడం లేదు. మొదటి నుండి నేను వివాదాలకు దూరంగానే ఉంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు.  

ఇవి కూడా చదవండి.. 

నటుడు రాజేంద్రప్రసాద్ కామపిశాచి.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

పబ్లిక్ గా పవన్ అలాంటి కామెంట్స్ చేస్తారా..? శ్రీరెడ్డి ఫైర్!

విశాల్ స్పీచ్ కి కీర్తి సురేష్ స్మైల్.. శ్రీ రెడ్డి ఫైర్!

ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఓటమి తప్పదు.. శ్రీరెడ్డి కామెంట్స్!

క్రికెట్ దిగ్గజంపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!