MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా

Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా

Duniya Vijay Divorce: కన్నడ నటుడు దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్నకు కర్ణాటక హైకోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పు ప్రకారం, విజయ్ తన భార్య నాగరత్నకు శాశ్వత భరణంగా రూ.2 కోట్లు చెల్లించాలి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 03 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భార్యతో దునియా విజయ్‌కి విడాకులు మంజూరు చేసిన హైకోర్ట్
Image Credit : stockPhoto

భార్యతో దునియా విజయ్‌కి విడాకులు మంజూరు చేసిన హైకోర్ట్

కన్నడ నటుడు, డైరెక్టర్ అయిన 'దునియా' విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న వైవాహిక బంధం అధికారికంగా ముగిసింది. ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న ఈ విడాకుల కేసును కర్ణాటక హైకోర్టు పరిష్కరించింది. ఈ జంటకు అధికారికంగా విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్‌కి కోర్ట్ కండీషన్లు
Image Credit : stockPhoto

విజయ్‌కి కోర్ట్ కండీషన్లు

విడాకులు మంజూరు చేయడంతో పాటు, భార్య నాగరత్నకు శాశ్వత భరణం (Permanent Alimony) కింద ఏకంగా రూ.2 కోట్లు చెల్లించాలని నటుడు దునియా విజయ్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అంతేకాదు పిల్లల బాధ్యత కూడా విజయ్‌దే అని చెప్పడం విశేషం.

35
భార్యకి 2 కోట్ల భరణం
Image Credit : stockPhoto

భార్యకి 2 కోట్ల భరణం

నటుడు దునియా విజయ్ విడాకుల కోసం వేసిన పిటిషన్‌ను జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతిభూషణ్‌లతో కూడిన కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుంది. దునియా విజయ్ సామాజిక హోదా, కెరీర్, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి, భార్యకు రూ.2 కోట్ల భరణం ఇవ్వాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చింది.

45
పిల్లల బాధ్యత విజయ్‌ దే
Image Credit : stockPhoto

పిల్లల బాధ్యత విజయ్‌ దే

విజయ్, నాగరత్న దంపతులకు ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం, ఈ ముగ్గురు పిల్లల పోషణ, చదువు, ఇతర పూర్తి బాధ్యతలను నటుడు దునియా విజయ్ చూసుకుంటారు.

55
ఏళ్లనాటి కుటుంబ కలహాలకు తెర
Image Credit : stockPhoto

ఏళ్లనాటి కుటుంబ కలహాలకు తెర

దునియా విజయ్, నాగరత్న మధ్య కుటుంబ గొడవలు గతంలో పోలీస్ స్టేషన్, మీడియా, ఫ్యామిలీ కోర్టు వరకు వెళ్లాయి. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. ఫ్యామిలీ కోర్టు విడాకుల పిటిషన్‌ను తిరస్కరించడంతో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత, ఈ జంట మళ్లీ కలిసి జీవించడం అసాధ్యమని హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ధారించింది. దీంతో షరతులతో కూడిన విడాకులు మంజూరు చేసి, ఈ హై ప్రొఫైల్ కుటుంబ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది.

దునియా విజయ్‌ ఆ మధ్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ బాలయ్య హీరోగా నటించిన `వీరసింహారెడ్డి` చిత్రంలో విలన్‌గా నటించాడు. ఇక ప్రస్తుతం ఆయన ఐడీ రంగానికి చెందిన కీర్తి గౌడతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇప్పుడు విడాకులు రావడంతో అధికారికంగా పెళ్లి చేసుకుంటారని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్
Recommended image2
Shriya Saran: రెడ్‌ శారీలో శ్రియా శరణ్‌ అదిరిపోయే లుక్‌.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు
Recommended image3
Vivek Oberoi: క్యాన్సర్‌ను జయించి హీరోయిన్ అయిన దత్తపుత్రిక.. ఎమోషనల్ అయిన వివేక్ ఒబెరాయ్
Related Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved