సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మానసిక రోగి అని, అతడిని మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని సంచలన కామెంట్స్ చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా ఆయన ఓ కామపిశాచి అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

''మిస్టర్ రాజేంద్రప్రసాద్ ఆరు నెలల్లోనే మా అసోసియేషన్ నుండి ఎందుకు బయటకి వచ్చేశావో అందరికీ తెలుసు.. హీరోయిన్ మాళవిక(సీనియర్ నటి) ఇండస్ట్రీని ఎందుకు వదిలేసి వెళ్ళిపొయిందో అందరికీ తెలుసు.. నువ్వు ఆమెని ఎంతగా వేధించావో.. మహిళా ఆర్టిస్టులని నీ కోరికలు తీర్చమని ఎంతగా ఇబ్బంది పెట్టావో అందరికీ తెలుసు..

నీ కూతురు ఇంటి నుండి ఎందుకు పారిపోయిందో కూడా తెలుసు.. నటి హేమ నీతో ఎందుకు గొడవ పడింది..? ఓ సీనియర్ నటుడిగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ఓ మనిషిగా మాత్రం కాదు'' అంటూ రాజేంద్రప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటివరకు హీరోలు, డైరెక్టర్లపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు సీనియర్ నటులపై కూడా పడింది.