Asianet News TeluguAsianet News Telugu

విశాల్ స్పీచ్ కి కీర్తి సురేష్ స్మైల్.. శ్రీ రెడ్డి ఫైర్!

మహానటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పై శ్రీ రెడీ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేసింది. ఇప్పుడు నీ టైమ్ బావున్నందుకు మేఘాల్లో తేలుతున్నావ్. ఎప్పుడో ఒకసారి స్ట్రగులర్స్ బాధ ఏమిటో నీకు అర్థమవుతుందని కీర్తి నవ్విన వెకిలి నవ్వును తాను ఎన్నటికీ మర్చిపోలేను అని పేర్కొంది. 

sri reddy comments on keerthi suresh
Author
Hyderabad, First Published Sep 27, 2018, 12:54 PM IST

క్యాస్టింగ్ కౌచ్ పై మొదట్లో పోరాటం చేసిన శ్రీ రెడ్డి ఆ తరువాత పాలిటిక్స్ లో భాగంగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె పూర్తిగా కోలీవుడ్ పై ద్రుష్టి పెట్టారు. అయితే మహానటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పై శ్రీ రెడీ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేసింది. 

ఇప్పుడు నీ టైమ్ బావున్నందుకు మేఘాల్లో తేలుతున్నావ్. ఎప్పుడో ఒకసారి స్ట్రగులర్స్ బాధ ఏమిటో నీకు అర్థమవుతుందని కీర్తి నవ్విన వెకిలి నవ్వును తాను ఎన్నటికీ మర్చిపోలేను అని పేర్కొంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రీసెంట్ గా పందెంకోడి 2 ఆడియో వేడుకలో విశాల్ శ్రీ రెడ్డి గురించి మాట్లాడాడు. ఆమెతో పని చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉంటె మంచిది. శ్రీ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటూ అవకాశాలు దక్కించుకోవడం మంచి పరిణామం. కాకపోతే ఆమెతో ఉన్నవారు సేఫ్టీగా కెమెరాలను ఉంచుకోవడం బెటర్. అలా ఉంటె శ్రీ రెడ్డికి కూడా ఆటోమేటిక్ గా రక్షణ కల్పించినట్లే అని విశాల్ పేర్కొన్నారు. 

దీంతో ఆ వేడుకలో ఉన్న వారందరు విశాల్ స్పీచ్ కు నవ్వేశారు. అందులో కీర్తి సురేష్ కూడా ఉన్నారు. ఆమె నవ్వడంపై శ్రీ రెడ్డి డిఫెరెంట్ గా కామెంట్ చేశారు. కీర్తి సురేష్ నవ్వును చుసిన తరువాత అసహ్యం వేసింది. నీ టైమ్ బావుందని మేఘాల్లో తేలుతున్నావ్. ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోకు. స్ట్రగులర్స్ బాదేంటో ఎదో ఒకరోజు నీకు తెలుస్తుంది. నువ్వు నవ్విన వెకిలి నవ్వును నేను ఎప్పటికి మరచిపోలేనని శ్రీ రెడ్డి వివరించారు.    

 

Follow Us:
Download App:
  • android
  • ios