MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం

Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం

ఈ వారం(మార్చి 6న) థియేటర్లోకి ఐదు సినిమాలున్నాయి. ఇందులో శివాజీ, లయ జంటగా నటించిన మూవీ, శ్రీవిష్ణు చిత్రం, వరలక్ష్మీ దర్శకత్వం వహించిన సినిమాలున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 03 2026, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మార్చి 6న థియేటర్లోకి ఐదు సినిమాలు
Image Credit : Asianet News

మార్చి 6న థియేటర్లోకి ఐదు సినిమాలు

ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి అన్నీ చిన్న సినిమాలే వస్తున్నాయి. ఓ మోస్తారు నుంచి, తక్కువ బడ్జెట్‌ మూవీస్‌ విడుదలవుతున్నాయి. ఇప్పుడు మార్చి మొదటి(మార్చి 6) వారంలో కూడా అలాంటి చిత్రాలే వస్తున్నాయి. అయితే ఇందులో విశేషమేంటంటే గత వారం శ్రీవిష్ణు సందడి చేశాడు. ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఆయన నటించిన మరో సినిమా విడుదల కానుంది. అలాగే వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటించిన మూవీ, శివాజీ హీరోగా చేసిన చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఆ సినిమాలేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`మృత్యుంజయ్‌`తో రాబోతున్న శ్రీవిష్ణు
Image Credit : Asianet News

`మృత్యుంజయ్‌`తో రాబోతున్న శ్రీవిష్ణు

శ్రీవిష్ణు కామెడీ సినిమాలకు కేరాఫ్‌. ఆయన గత వారం `విష్ణు విన్యాసం` అనే సినిమాలో నటించాడు. దీనికి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. ఆయన `మృత్యుంజయ్‌` అనే చిత్రంలో నటించాడు. శ్రీవిష్ణుకి జోడీగా రెబా జాన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి శ్రీ హుస్సేన్‌  కిరణ్‌ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్‌ బాక్స్ మీడియా, పిక్చర్స్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించారు. ఇది మార్చి 6న విడుదల కానుంది.

36
సరస్వతితో రాబోతున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌
Image Credit : Asianet News

సరస్వతితో రాబోతున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌

మార్చి 6న రాబోతున్న మరో మూవీ `సరస్వతి`. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రమిది. తనే నిర్మిస్తూ మెయిన్‌ లీడ్‌గానూ నటించింది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి, గెటప్‌ శ్రీను వంటి వారు నటించారు. చిన్నారి మిస్సింగ్‌ కేసు చుట్టూ తిరిగే కోర్ట్ రూమ్‌ డ్రామా ఇది. విడుదలైన టీజర్‌, ట్రైలర్ ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఇటీవల బాలయ్య కూడా ట్రైలర్‌ విడుదల చేసి అభినందించారు. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.

46
శివాజీ, లయ కలిసి `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`
Image Credit : Asianet News

శివాజీ, లయ కలిసి `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`

ఈ శుక్రవారం(మార్చి 6)న రాబోతున్న మరో సినిమా `సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని`. `టాటా బిర్లా మధ్యలో లైలా` తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన చిత్రమిది. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

56
మల్లెటూరి నేపథ్యంలో `మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌`
Image Credit : Asianet News

మల్లెటూరి నేపథ్యంలో `మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌`

పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో రూపొందిన లేటెస్ట్ మూవీ `మెన్షన్‌ ‌ హౌజ్‌ మల్లేష్‌`. శ్రీనాథ్‌ మాగంటి హీరోగా, గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల హీరోయిన్లుగా రూపొందింది. బాల సతీష్‌ దర్శకత్వం వహించారు. అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్న హీరో పెళ్లి చేసుకుని సంసార జీవితానికి సిద్ధమవడం, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఫన్నీ సంఘటనల సమాహారమే ఈ మూవీ. ఇది మార్చి 6న విడుదల కాబోతుంది.

66
సునీల్‌ కుమార్‌ రెడ్డి కాక్రోచ్‌
Image Credit : Asianet News

సునీల్‌ కుమార్‌ రెడ్డి కాక్రోచ్‌

`సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం `కాక్రోచ్`. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. కొందరు క్రిమినల్స్, ప్రాస్టిట్యూటర్‌ మధ్య సాగిన ప్రేమ కథ నేపథ్యంలో సాగే చిత్రమిది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌
Recommended image2
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved