కథానాయకుడు సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సినిమా విడుదల తరువాత ఎంతవరకు విజయం సాధిస్తుందో గాని ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ తో కథానాయకుడు రిలీజ్ కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా థ్రియేటికల్ రైట్స్ పరంగా సినిమా 70కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. 

గతంలో బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి 50 కోట్ల ధరకు అమ్ముడుపోగా ఈ సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతుందడం విశేషం. కేవలం ఆంధ్ర - తెలంగాణలోనే సినిమా 54.10 కోట్ల ధర పలికింది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో 5.90 కోట్లకు.. అలాగే ఇతర దేశాల్లో అంతా కలుపుకొని 10 కోట్ల రేట్ తో థ్రియేటికల్ బిజినెస్ జరిగింది. మొత్తంగా క్రిష్ కెరీర్ లో కూడా ఇదే హైయ్యెస్ట్ మూవీ. 

70 కోట్ల ప్రీ రిలీజ్ అంటే సినిమా 100 కోట్ల షేర్స్ రాబడితేనే బ్లాక్ బస్టర్ హిట్  గా నిలుస్తుంది. మరి అన్ని కోట్లను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి. ఎన్టీఆర్ సినిమాకు ప్రమోషన్స్ తో కలుపుకొని 60 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. అయితే ఆడియో - శాటిలైట్ - డిజిటల్ రైట్స్ ఇతర బిజినెస్ లతో కలిపి సినిమాకు లాభాలు అందుకుంది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ బోనస్ లే..  

బుధవారం రిలీజ్ కానున్న ఈ బయోపిక్ బెన్ఫిట్ షోలకు పలు థియేటర్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 5గంటలకే షోలు ప్రారంభం కానున్నాయి. మరి భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?