MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్

Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్

Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో సాగర్, నర్మదను తీసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. మరోవైపు భాగ్యం విశ్వను రెచ్చగొడుతుంది. రైస్ మిల్లు కొట్టేయడానికి ప్లాన్ వేస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 04 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విశ్వను రెచ్చగొట్టిన భాగ్యం
Image Credit : jio hotstar

విశ్వను రెచ్చగొట్టిన భాగ్యం

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో విశ్వక్ అమూల్య చేతిలో దెబ్బలు తిన్నాక మందు తాగుతూ ఉంటాడు. అక్కడికి ఇడ్లీ బాబాయ్, భాగ్యం కూడా వస్తారు. ఇడ్లీ బాబాయ్ కూడా మందు తాగుతాడు. విశ్వ ఆనందంతో ‘మీరే ఏదో చేసి నర్మద, సాగర్ ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేశారు కదా. మీకు సన్మానం చేయాలి’ అని అంటాడు. దానికి భాగ్యం ‘నీ కుట్ర కంటే మాది పెద్ద కుట్రా? రామరాజు కూతురినే పెళ్లి చేసుకుని మరీ వచ్చావు’ అని అంటుంది. దానికి విశ్వ ‘నేను అమూల్యని పెళ్లి చేసుకోలేదు.. దానికి ఎవడో సలహా ఇచ్చాడు, అదే తాళి వేసుకొని వచ్చింది. అది ఎవరో తెలిస్తే అప్పుడు చెబుతాను’ అంటూ మాట్లాడతాడు. దానికి భాగ్యం అమూల్యని టార్చర్ చేస్తే నిజం చెప్పదు. దాన్ని ఫుల్లుగా రెచ్చగొట్టు అప్పుడు చెప్పేస్తుంది అని ఐడియాలు ఇస్తుంది. విశ్వ ఇక ఫుల్లుగా తాగేసి ఇకపై చూసుకుంటా అని పడిపోతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇంటికి వచ్చిన సాగర్, నర్మద
Image Credit : Jio hotstar

ఇంటికి వచ్చిన సాగర్, నర్మద

ఇక రామరాజు ఇంట్లో అందరూ సాగర్, నర్మద వెళ్ళిపోయారు అన్న బాధలో ఉంటారు. వల్లి మాత్రం ఆనందంతో గంతులు వేస్తుంది. వల్లి భాగ్యం ఇడ్లీ బాబాయ్ ఆనందంతో తేలిపోతూ ఉంటారు. ‘ప్రేమ, ధీరజ్ లు వెనకే వెళ్లారు. సాగర్, నర్మదని తీసుకొచ్చేస్తారంటావా’ అని అంటుంది వల్లి. దానికి భాగ్యం ‘అస్సలు రారు.. ఈలోపు నువ్వు వాళ్ళ గదిని మాకు వచ్చేలా మీ అత్త మామలతో మాట్లాడు. మేము ఆ గదిని ఆక్రమించేస్తాం, ఆ తరువాత రైస్ మిల్లుని, ఇంటిని కూడా ఆక్రమించేద్దాం’ అని సలహా ఇస్తుంది. కానీ ఈ లోపే ధీరజ్, ప్రేమ కలిసి నర్మద, సాగర్ ని ఇంటికి తీసుకొస్తారు.

నర్మద, సాగర్, ప్రేమ, ధీరజ్ ఇంట్లోకి రావడం తిరుపతి చూసి ఆ విషయాన్ని అందరికీ చెబుతాడు. దాంతో వల్లి, భాగ్యం షాక్ అయిపోతారు. భాగ్యం వల్లితో వెళ్ళు వెళ్ళు ఏదో ఒకటి మాట్లాడు లేకపోతే అనుమానం వస్తుందని చెబుతోంది. దాంతో వల్లి ఎదురుగా వెళ్లి లోపలికి రండి అని నటించడం మొదలు పెడుతుంది. వెంటనే ప్రేమ ‘మన ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి. వాటి వల్లే బాగా దిష్టి తగిలింది. వెళ్లి దిష్టినీళ్లు తెచ్చి దిష్టి తీయు’ అని చెబుతుంది వల్లికి. దానికి వల్లి నేను తీయాలా అని అడుగుతుంది. వెంటనే ప్రేమ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే కదా దిష్టినీళ్లు తెచ్చి దిష్టి తీయు అని చెబుతుంది. దాంతో వల్లి ఆ పని చేస్తుంది.

34
ప్రేమ ధీరజ్ రొమాన్స్
Image Credit : Jio hotstar

ప్రేమ ధీరజ్ రొమాన్స్

ధీరజ్, ప్రేమ ఇద్దరూ కలిసి కష్టపడి సాగర్ నర్మదలను ఒప్పించి ఇంట్లోకి తీసుకు వస్తారు. ధీరజ్ రామరాజు దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ రామరాజు అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. తర్వాత వేదవతి దగ్గరికి వెళ్లి అమ్మ నేనే అన్నయ్య వదినల్ని ఇంటికి తీసుకొచ్చాను అని చెబుతాడు. వేదవతి కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక చందు కూడా తన దారిన తను వెళ్ళిపోతాడు. నర్మదా సాగర్ తో అన్ని సర్దుకుంటాయని, గదిలోకి వెళ్లమని చెబుతారు. ఇక వల్లి మాత్రం తోటి కోడలు ఇంట్లోకి వచ్చేసిందని తెగ బాధపడిపోతూ ఉంటుంది.

ఇక్కడ నుంచి సీన్... ప్రేమ, ధీరజ్ దగ్గరికి మారుతుంది. వారిద్దరి మధ్య మళ్ళీ రొమాన్స్ మొదలైపోతుంది. ప్రేమ ధీరజ్ తో నీ వల్లే నర్మదక్క, సాగర్ ఇంటికి వచ్చారు థాంక్యూ సో మచ్ అని భుజంపై వాలుతుంది. దీనికి ఎందుకు థాంక్స్ అంటూ ప్రేమతో కాసేపు రొమాన్స్ చేస్తాడు. కానీ ప్రేమ ధీరజ్ ను దూరంగా తోసేస్తుంది. ఇద్దరు కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకొని ఆడుకుంటారు. సులువుగా ప్రేమ ఆటలో ఓడించేస్తుంది. తర్వాత ధీరజ్ నుదుటిపై ముద్దు పెడుతుంది. కానీ తనకి చెంప మీదే ముద్దు కావాలని అడుగుతాడు. కానీ ప్రేమ పెట్టి పెట్టినట్లు ఒకటి ఇచ్చి వెళ్ళిపోతుంది.

44
నర్మదపైనే ఏడుపు
Image Credit : Jio hotstar

నర్మదపైనే ఏడుపు

ఇక్కడ నుంచి సీన్ రామరాజు దగ్గరికి మారుతుంది. రామరాజు గదిలో కూర్చుని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. వేదవతి వెళ్లి ‘నర్మద సాగర్ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతుంటే ఎంత బాధపడ్డానో..లోలోపల ఎంత ఏడ్చానో’ అని అంటుంది. తర్వాత ముగ్గురు కొడుకులు తనకు మాటిచ్చారు అని అందుకే చిన్నోడు జాగరణ తీసుకొచ్చాడని చెబుతుంది. కానీ రామరాజు ‘ఒకసారి వాళ్ళకి ఇంట్లోంచి వెళ్లిపోవాలని మనసులో పుడితే అది పోదు.. వాడు తప్పు చేశాడు పశ్చాత్తాప పడాలి, కానీ అదేమీ లేకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు అంటే అది మూర్ఖత్వం. వాడికి అనిపించి ఇంట్లోకి రాలేదు. చిన్నోడు బతిమిలాడితే వచ్చాడు, కోడలు కూడా అలాగే ఉంది. ఇన్నాళ్లు కోడలు, కోడలు అని మన ముద్దు చేశాము, తనల్ని కానీ మనల్ని మోసం చేసింది అంటూ నర్మదపై కోపాన్ని పెంచుకుంటాడు రామరాజు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image2
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image3
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంచి బయటికొచ్చేసిన సాగర్ నర్మద
Recommended image2
Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved