తెలంగాణా ప్రభుత్వం సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోల ప్రదర్శనకి అనుమతి ఇవ్వడం మానేసింది. బెనిఫిట్ షోల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని కాబట్టి అసలు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే బెటర్ అని ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు బదులు రోజులు ఆరు ఆటలు వేసుకునే విధంగా అదనపు షోలకు అనుమతులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల హంగామా తగ్గినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం ఆ జోరు ఏమాత్రం తగ్గలేదు.

తాజాగా ఎన్టీఆర్ 'కథానాయకుడు' బెనిఫిట్ షో టికెట్స్ ఓవర్సీస్ లో భారీ రేటుకి అమ్ముడిపోయాయి. ఓ ఎన్నారై ఈ సినిమా మొదటి టికెట్ ని ఏకంగా మూడున్నర లక్షలు పెట్టి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని  డిస్ట్రిబ్యూటర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేశాడు.

కానీ ఈ రేంజ్ లో టికెట్ అమ్ముడవ్వడం ఎన్టీఆర్ బయోపిక్ పై ఉన్న క్రేజ్ కి నిదర్శనమనే చెప్పాలి. మరికొద్ది గంటల్లో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?