MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?

చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య అనుబంధం అందరికి తెలిసిందే. ఇద్దరు మంచి బంధువులే కాదు.. స్నేహితులు కూడా. చిరంజీవితో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన అల్లు అరవింద్..ఓ సినిమా కోసం మెగాస్టార్ దగ్గర పచ్చి అబద్దం చెప్పాడట. ఇంతకీ ఏంటది.? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 04 2026, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి  అల్లు అరవింద్ అనుబంధం..
Image Credit : facebook @chirufans

చిరంజీవి- అల్లు అరవింద్ అనుబంధం..

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి–అల్లు కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్‌కు చిరంజీవి అంటే అపారమైన గౌరవం, అభిమానం. ఇప్పటికీ వీరి గురించి ఎన్ని వార్తలు వచ్చినా.. అదే అనుబంధం కొనసాగిస్తున్నారు. చిరంజీవితో ఎన్నో సినిమాలు నిర్మించాడు అల్లు అరవింద్. ఈక్రమంలో ఓ సినిమా కోసం అరవింద్ చిరంజీవితో ఓ అబద్దం కూడా చెప్పాడ. అది కూడా దర్శకుడు కే విశ్వనాధ్ తో చిరంజీవి కాంబినేషన్ కలపాలని అలా చేశారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించిన సినిమాలు.
Image Credit : facebook @chirufans

చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించిన సినిమాలు.

చిరంజీవి స్టార్‌గా ఎదగడంలో.. అల్లువారు నిర్మించిన చాలా సినిమాలు ప్రముఖ పాత్ర పోషించాయి. చిరంజీవి సినిమాల వల్ల గీతా ఆర్ట్స్ స్థాయి కూడా అమాంతం పెరిగింది. అల్ల అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చిరంజీవి హీరోగా వచ్చిన విజేత, శుభలేఖ, ఆరాధన, యమకింకరుడు, పసివాడి ప్రాణం, రౌడీ అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అన్నయ్య, ఎస్పీ పరశురామ్, మాస్టర్, డాడీ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. నిర్మాతగా అల్లు అరవింద్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఈ సినిమాలు కీలక పాత్ర పోషించాయి.

35
కె విశ్వనాథ్ తో మెగా కాంబినేషన్ కలపాలని..
Image Credit : youtube/@aha

కె విశ్వనాథ్ తో మెగా కాంబినేషన్ కలపాలని..

చిరంజీవిని ఇంటి అల్లుడిని చేసుకున్న తరువాత ఆయన వెన్నెంటే ఉన్నారు అరవింద్. మెగాస్టార్ తో వరుస సినిమాలు కూడా ప్లాన్ చేశాడు. అప్పటికే స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవితో మంచి మంచి సినిమాలు చేయాలని ఎప్పుడు ప్లాన్ చేస్తుండేవారట అల్లు అరవింద్. 

ఈక్రమంలోనే ఆయన చూపు.. వరుస సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కె విశ్వనాథ్ మీదకు వెళ్ళింది. చిరంజీవితో విశ్వనాథ్ కాంబినేషన్ ఎలాగైనా కలిపితే.. అద్భుతమైన సినిమా వస్తుందని.. అది చిరంజీవి కెరీర్ కు కూడా ఉపయోగపడుతుందని అరవింద్ అనుకున్నారట.

45
చిరంజీవికి అబద్దం చెప్పి అల్లు అరవింద్..
Image Credit : facebook @chirufans

చిరంజీవికి అబద్దం చెప్పి అల్లు అరవింద్..

కె విశ్వనాథ్ డైరెక్షన్ లో ఎలాగైనా చిరింజీవితో ఓ సినిమా చేయాలని చూసిన అరవింద్.. విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి.. చిరంజీవి గారు మీతో మంచి సినిమా చేయాలని ఆశపడుతున్నారని అబద్దం చెప్పాడు, ఇటు చిరంజీవి దగ్గరకు వచ్చి.. కె విశ్వనాథ్ గారు మీతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టైమ్ లో మీ కాంబోలో మంచి సినిమా పడితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారట. దాంతో వీరి కాంబోలో సినిమాలకు అరవింద్ రూట్ క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు.

55
చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు..
Image Credit : Asianet News

చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు..

చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. అరవింద్ ప్రయత్నంతో మొదటగా వీరి కొంబోలో శుభలేఖ సినిమా తెరెక్కింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఆతరువాత కాలంలో చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబోలో ఆపద్భాందవుడు, స్వయంకృషి సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలతో చిరంజీవికి ఎంతో పేరొచ్చింది. అందుకే కె విశ్వనాథ్ పై ఎంతో అభిమానం చూపించేవారు మెగాస్టార్. ఆయన తో చివరి వరకూ మంచి అనుబందం కొనసాగించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image2
Rajamouli : నేను మూర్ఖుడిని కాను.. ఆ పేరు చెప్పను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved