Asianet News TeluguAsianet News Telugu

చిన్మయిపై మీడియా దారుణ దాడి,తల దించుకునే క్షణాలు

ప్రముఖ గాయనీ చిన్మయి  ఇటీవల ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తుపై చేసిన లైంగిక ఆరోపణల ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో మీడియాలో రకరకాల కథనాలు ప్రచారమవుతున్నాయి. వైరముత్తు ఇలాంటివాడా? అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆయన సానుభూతిపరులు అవన్నీ ఆరోపణలే అంటూ కొట్టిపారేస్తున్నారు. 

Media attacks chinmayi
Author
Hyderabad, First Published Oct 24, 2018, 10:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ గాయనీ చిన్మయి  ఇటీవల ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తుపై చేసిన లైంగిక ఆరోపణల ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో మీడియాలో రకరకాల కథనాలు ప్రచారమవుతున్నాయి. వైరముత్తు ఇలాంటివాడా? అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆయన సానుభూతిపరులు అవన్నీ ఆరోపణలే అంటూ కొట్టిపారేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో రీసెంట్ గా చిన్మయి తనలా లైంగిక వేధింపులకు గురైన మరికొంతమంది సిని,టీవి ఇండస్ట్రీకి చెందిన మహిళలతో మీడియా సమావేశం నిర్వహించటం జరిగింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఉమెన్స్ అశోశియోషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీట్ లో ....  లీనా మణి మేఖలై, చిన్మయి శ్రీపాద, శ్రీరంజని, లక్ష్మి రామకృష్ణన్  మాట్లాడి, తమ వేదనను వెల్లబుచ్చటానికి వచ్చారు.  అయితే ఊహించని విధంగా ఈ ప్రెస్ మీట్ ...వేధింపుల మీట్ లా తయారైంది. సానుభూతి చూపి అండగా ఉండాల్సిన మీడియా మాటలతో దాడి చేసింది.

అక్కడకి వచ్చిన మీడియా రిపోర్టర్స్ చాలా దారుణంగా ప్రశ్నలతో వారిని మాట్లాడనివ్వకుండా చేసే ప్రయత్నం చేసారు. ఇది ఊహించని సంఘటన. తమిళ మీడియా తలదించుకోవాల్సిన సంఘటనగా అభివర్ణిస్తున్నారు. అక్కడకి వచ్చిన చాలా మంది మగ జర్నలిస్ట్ లు ఈ బాధిత మహిళలపై ప్రశ్నలతో దాడి చేసారు. తాము రాజకీయనాయకులం, రేపిస్ట్ లమో, బ్యూరోకార్ట్స్ మో కాదని,కేవలం లైంగిక వేధింపులకు గురైన మహిళలమని వారు ఆ మహిళలు మొత్తుకోవాల్సి వచ్చింది. చిన్మయి చేతులు జోడించి...కాస్త సున్నితంగా మాట్లాడండి, మీరు అలా మాట్లాడటం ఆపండి..ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. 

మేము వేధింపులకు సంభందించిన మా జీవిత విషయాలు మాట్లాడటానికి ఇక్కడకి వచ్చాం ..అంతేతప్ప ఈ దేశంలో ఉన్న మగవాళ్లందరినీ డీ ఫేమ్ చేసేందుకు కాదు. దయచేసి ఈ విషయంలో మగవాళ్లను మాకు అండగా నిలబడమని కోరుతున్నాం. ఇప్పటికే మా మీద చాలా మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఏకంగా ఇక ఆపండి..చాలు అంటున్నారు అని ఆమె ఆవేదనగా అన్నారు. ఆమె అంతలా అనటానికి కారణం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్  జరుగుతున్నప్పుడు వచ్చిన రిపోర్టర్స్ బాధిత మహిళల మీద అరవటమే.

కొంతమంది మీడియా వ్యక్తులు...అడిగిన ప్రశ్నలు గుండెను నీళ్లు చేసేలా..కడుపులో దేవేలా ఉన్నాయి. 

"మీరు ఇదంతా సోషల్ మీడియాలో పెట్టేముందు ..విశాఖ కమిటీ ను ఎందుకు పిర్యాదు చేయలేదు ?" అని కొందరు సూటిగా అడిగారు. అయితే అసలు అలాంటి కమిటీ లేదని సమాధానమొచ్చింది.

మరొకరు అయితే మిమ్మల్ని డైరక్టర్ సుశీ గణేషన్ ..లైంగికంగా వేధించారు అన్నారు కదా.. "అసలు ఎగ్జాట్ గా ఆ సమయంలో ఏం జరిగింది?ఎక్కడ జరిగింది? ఎలాంటి టార్చర్ మిమ్మల్ని ఆయన పెట్టారు?" అంటూ లీనా మణిమేఖలను ప్రశ్నించారు.

దాంతో లీనా షాక్ అయ్యి, "నేను ప్రతీది వివరంగా ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చెప్పాను. ఇప్పుడు మళ్లీ అదంతా గుర్తు చేసుకుని చెప్పమనటం భావ్యం కాదు. ఇదేమీ కోర్ట్ కాదు...మీరు నన్నేమీ క్రాస్ ఎగ్జామ్ చెయ్యాల్సిన పనిలేదు ." అని కాస్తంత అసహనంగా అన్నారామె.


అయినా మరో రిపోర్టర్ ఆగక...  " మీరు దర్శకుడు సుశీ గణేషన్ పై చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా..మీరు చెప్పే సంవత్సరానికి...సుశీ గణేషన్ చెప్పే సంవత్సరానికి చాలా తేడా ఉందే..అయినా ఆధారాలు చూపకుండా మీరు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు...మీరు ఎందుకు ఆలోచించలేదు ఆ విషయం?" అని గట్టిగా అరుస్తూ ఆడిగారు. ఆమె తను ఆ ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ లో ఉన్నాయని చెప్పగా..ఇప్పుడు ఇక్కడే సమాధానాలు చెప్పాలని, లేకపోతే బాయ్ కాట్ చేస్తామని బెదిరించారు. మీరు అంతలా అరవొద్దు అని అనగా..వాళ్లు మరింతగా తమ గొంతును పెంచారు.

మరొక జర్నలిస్ట్ గట్టిగా మాట్లాడుతూ, " చట్టం దగ్గర ఫిర్యాదు చేయటంలో ఏ తప్పు లేదు. చట్టం ముందు అంతా సమానులే. అయితే మీరు ఫిర్యాదు చేసేముందు రుజువులు దగ్గరపెట్టుకోవాలి.  అసలు మీరు కేసు పెట్టకుండా ఎలా ఫనిష్ చేద్దామనుకుంటున్నారు. కేవలం సుశీ గణేషన్ ను, వైరముత్తుని పరువు తియ్యటానికి, డీఫేమ్ చెయ్యటానికే ఇలా చేస్తాన్నారా. ఏదైనా చట్టబద్దంగా చెయ్యండి..మా మద్దుతు ఉంటుంది. మహిళలకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్స్,కోర్ట్ లు ఉన్నాయని మర్చిపోవద్దు సైతం ఉన్నాయి." అన్నారు.

ఇక చిన్మయిని అయితే  "వైరముత్తు అలాంటివాడు అనుకున్నప్పుడు ఆయన్ని మీ పెళ్లికి ఎందుకు ఆహ్వానించారు?"

"ఆయన పాదాలపై పడి ఎందుకు ఆశ్వర్వాదం కోరుకున్నారు?"

"ఈ ఆరోపణల వెనుక పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా?"

అయితే ఇలా మీడియా వ్యక్తులు మాట్లాడతారని ఊహించని భాథిత మహిళలు..కోపం తెచ్చుకున్నా..దాన్ని అణుచుకుని ..అలా మాట్లాడవద్దని రిక్వెస్ట్ చేసారు. అయినా మీరు ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు ఫిర్యాదు చేయటం ఏమిటి అనే ప్రశ్నను వేయటం మాత్రం మీడియా అడగటం మానలేదు.

నటి రేవతిని కూడా ఈ మీడియా సమావేశం కు పిలిచారు కానీ ఆమె ...వేరే పోగ్రామ్స్,కమిట్మెంట్స్ ఉండటంతో రాలేకపోయింది.

ఇవి కూడా చదవండి.. 

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

Follow Us:
Download App:
  • android
  • ios