ప్రస్తుతం చిత్రసీమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోంది. ఒక్కొక్కరుగా బయటకొచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించడం మొదలుపెట్టారు.  ఇప్పటికే చాలా మంది నటీమణులు, సాంకేతికనిపుణులు లైంగిక వేధింపులపై కామెంట్స్ చేశారు.

వీరికి మద్దతుగా పలువురు తారలు నిలుస్తున్నారు. తాజాగా దర్శకురాలు లీనా మణిమేఖలై తనను దర్శకుడు సుశీ గణేశన్ కారులో వేధింపులకి గురి చేశాడని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

దీంతో సుశీ గణేశన్ ఆమెపై ఫైర్ అయ్యాడు. అయితే ఈ విషయంలో లీనాకి మద్దతిస్తూ హీరో సిద్ధార్థ్ ఓ ట్వీట్ చేశాడు. దీంతో సిద్ధార్థ్ కి బెదిరింపులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని సిద్ధార్థ్ స్వయంగా వెల్లడించారు.

'నా తండ్రికి సుశీ గణేశన్ ఫోన్ చేసి బెదిరించాడు. లీనాకి మద్దతుగా ఉంటే తీవ్ర పరిణామౌ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన గురించి అందరూ తెలుసుకోవాలి. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. నేను లీనాకు మద్దతుగానే ఉంటాను' అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. 

ఇవి కూడా చదవండి.. 

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!