మీటూ ఉద్యమంలో భాగంగా చాలా మంది మహిళలు తమను వేధించినవారి గురించి ధైర్యంగా ముందుకు వచ్చి వారి పేర్లను వెల్లడిస్తున్నారు. అయితే అటువంటిదేమీ జరగలేదని, కేవలం వ్యక్తిగత కోపాలతో ఇలాంటివి చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు కూడా సమాధానం ఇస్తున్నారు. అయితే నిజా నిజాలు బయిటకు వచ్చేలోగా డ్యామేజ్ అయితే జరిగిపోతుందనేది నిజం. 

రీసెంట్ గా తమిళ,తెలుగు చిత్రాల ప్రముఖ నటుడు అర్జున్‌ తనను వేధించారని నటి శ్రుతి హరిహరణ్‌  ఆరోపించారు. ఆయనతో చేసిన ఓ సినిమాలో సీన్  కోసం రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు ఆయన తనతో తప్పుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై అర్జున్‌ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా మాట్లాడుతూ విస్మయం వ్యక్తం చేసారు. తను అనుభవం ఉన్న నటుడు కాబట్టి దర్శకులు సలహాలు అడుగుతుంటారని పేర్కొన్నారు.

‘శ్రుతి హరి హరణ్  ఆరోపణలు విని, నేను షాక్‌ అయ్యా.. జీర్ణించుకోలేకపోయా. నేను దీనిపై మాట్లాడకుండా ఉంటే.. నిజంగానే నేను తప్పు చేశానని ప్రజలు అనుకుంటారు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్పష్టత ఇస్తున్నా’ అని  అర్జున్ అన్నారు.

అదే సమయంలో... నిజంగానే శ్రుతికి తనపై కోపం ఉంటే సినిమా ప్రమోషన్‌లో ఎందుకు ఆమె తనను ప్రశంసించారని అర్జున్‌ ప్రశ్నించారు. ‘ఆమె అప్పుడు నన్ను ఎందుకు ప్రశంసించింది.. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతోంది. ఆమె ఇలా ఆరోపించడం వెనుక ఎవరైనా ఉన్నారా?’ అని ఆయన‌ అన్నారు. ఏది నిజమో..ఎవరిది తప్పో అన్నట్లుుగా ఉందీ పరిస్దితి అంటున్నారు నెట్ జనులు. అయితే ఈ లోగా అర్జున్ ఇమేజ్ కు డ్యామేజ్ జరగటం మాత్రం నిజం అంటున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!