వాయిస్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్మయి తను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తనకు ఎనిమిదేళ్ల వయసులో తల్లితో కలిసి డాక్యుమెంటరీ రికార్డ్ కోసం వెళ్లిందట.

తన తల్లి పనిలో ఉండడంతో అక్కడే నిద్రపోయిందట చిన్మయి. కానీ ఎవరో తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్లు అనిపించడంతో లేచి చూస్తే పక్కన ఓ పెద్ద మనిషి ఉన్నాడని ట్వీట్ చేసింది చిన్మయి.

'ఓసారి యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయి కదల్లేని స్థితిలో ఉండగా.. నా దగ్గరకి వచ్చిన కొందరు మగాళ్లు షర్ట్ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా  చెస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నీచమైన ప్రవర్తన' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆన్ లైన్ లో కూడా తనను బెదిరిస్తున్నారని, ఆడవాళ్లే ఆడవాళ్లకు సపోర్ట్ చేయని పరిస్థితి వచ్చిందంటూ వాపోయింది. 

ఇది కూడా చదవండి.. 

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు