తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ సంజనా గల్రాని తనను మోసం చేశారని చేస్తోన్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు స్వైరవిహారం చేస్తోన్న సంగతి తెలిసిందే.

పలువురు నటీమణులు, టెక్నీషియన్లు బయటకొచ్చి తాము ఎదుర్కొన్న వేధింపులని బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలో నటి సంజన కూడా వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. 

''నాకు 15 ఏళ్ల వయసులో సినిమా చాన్స్ వచ్చింది. నటించి మళ్లీ చదువు కంటిన్యూ చేయోచ్చనే ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు బాలీవుడ్ 'మర్డర్' సినిమా చూపించి అదే సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో ముద్దు సీన్లు, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో నేను దానికి అంగీకరించలేదు.

దీంతో ఆయన కన్నడ ఆడియన్స్ కి తగ్గట్లుగా కథ మారుస్తున్నామని చెప్పడంతో ఒక ముద్దు సన్నివేశంలో మాత్రమే నటించడానికి అంగీకరించాను. సినిమా షూటింగ్ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్ వెళ్లాను. అయితే షూటింగ్ స్పాట్ కి మాత్రం అమ్మని వెంటబెట్టుకొని రాకూడదని దర్శకుడు చెప్పాడు. అక్కడ నాపై పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. 

చాలా అశ్లీల సన్నివేశాలను షూట్ చేశారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి నేను ఒప్పుకోకపోతే నీ కెరీర్ నాశనం చేస్తామని బెదిరించారు. చిన్నపిల్లనైన నన్ను ఇష్టానికి వాడుకున్నారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  

ఇవి కూడా చదవండి.. 

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!