'మీటూ' ఉద్యమం రోజురోజుకి ఉదృతంగా మారుతుంది. కొందరు నిజంగానే తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతుంటే మరికొందరు మాత్రం ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ పై 'మీటూ' ఆరోపణలు వినిపించాయి.

ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'కిజీ ఔర్ మ్యానీ' అనే సినిమాలో సంజన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని, సెట్స్ లో ఆమెని వేధించారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన సుశాంత్ అసలు సెట్ లో ఏం జరిగిందో, అతడు సంజనకి ఎలాంటి మెసేజ్ లు పంపించేవాడో.. స్క్రీన్ షాట్స్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

''కొందరు కావాలని చేస్తోన్న ఆరోపణలకి నేను క్లారిటీ ఇవ్వక తప్పడం లేదు. కొందరు మీటూ ఉద్యమాన్ని వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటున్నారు. అందుకే సంజనకు నాకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణని బయటపెడుతున్నా.. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తప్పే.. కానీ ఇలా చేయక తప్పడం లేదు.

సినిమా మొదలైన రోజు నుండి చివరివరకు చేసిన  మెసేజ్ లు ఇవే.. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి'' అంటూ పోస్ట్ పెట్టారు. అతడు షేర్ చేసిన స్క్రీన్ షాట్స్ లో ఎక్కడా.. కూడా సంజనతో తప్పుగా మాట్లాడినట్లు లేదు. సినిమా గురించి, నటన గురించే ఇద్దరూ మాట్లాడుకున్నారు.

సెప్టెంబర్ నెల నుండి తన ట్విట్టర్ ఖాతాకి వెరిఫైడ్ మార్క్ కనిపించడం లేదట.. దాన్ని అలసుగా తీసుకొని తన పేరును వాడుకోవాలని చూస్తున్నట్లు సుశాంత్ ఆరోపించారు. 

ఇవి కూడా చదవండి.. 

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!