సీనియర్ నటుడు అర్జున్ పై నటి శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించారు అర్జున్. తాజాగా అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా శ్రుతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చిన ఐశ్వర్య.. తన తండ్రిని పబ్ కి వెళ్లడమే ఎప్పుడూ చూడలేదని అలాంటిది  
ఆమెని రిసార్ట్ కి రమ్మంటారా..? అంటూ ఫైర్ అయింది.

''నాన్న తన సినిమాలకు సంబంధించిన కథలను మమ్మల్ని కూడా వినమంటారు. 'నిబునన్' సినిమా స్క్రిప్ట్ లో ఒకటిరెండు చోట్ల ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు నాన్న వాటిని తొలగిస్తే కానీ సినిమా చేయనని చెప్పారు. మరి ఆ సమయంలో శ్రుతి ఎందుకు మాట్లాడలేదు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం శ్రుతి సినిమా షూటింగ్ లో ఐదు రోజులు మాత్రమే పాల్గొంది. 

ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి రెండు రోజులు చాలు.. షూటింగ్ లో పాల్గొన్న ఐదు రోజుల్లో మా నాన్న కారణంగా ఇబ్బంది కలిగిందని, రిహార్సల్స్ నిమిత్తం సెట్స్ కు రానని శ్రుతి తన ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పారు. అలాంటప్పుడు ఆమెని రిసార్ట్ కి రమ్మని, డిన్నర్ కి రమ్మని పిలవడానికి మా నాన్నకి సమయం ఎక్కడుంది..? ఇన్నేళ్ల జీవితంలో మా నాన్న పబ్ కి వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు.

అలాంటిది ఆమెని రిసార్ట్ కి రమ్మంటారా..? ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా అతని పాత్ర అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే దాన్ని మీటూ అంటారు. శ్రుతి చేస్తోన్న ఆరోపణల్లో ఆ విషయం ఎక్కడా కనిపించడం లేదు. ఆమె సొంత లాభాల కోసం ఇలా చేస్తున్నారు. అందువల్లే కదా ఆమె పేరు మీడియాలో మారుమోగుతోంది'' అంటూ చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి.. 

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు