ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తుపై సింగర్ చిన్మయితో సహా పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దివంగత ప్రఖ్యాత గాయకుడు, నటుడు మలేషియా వాసుదేవన్ కోడలు, గాయని హేమమాలిని.. వైరముత్తు గురించి మాట్లాడుతూ ఆయనేం అంత మంచోడు కాదని వెల్లడించింది.

తన ఫేస్ బుక్ అకౌంట్ లో గాయని చిన్మయికి మద్దతు తెలుపుతూ.. సినీ పరిశ్రమ చిన్మయికి మద్దతుగా ఎందుకు నిలబడడం లేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ''వైరముత్తు సచ్చీలుడు కాదనే విషయం సినీ పరిశ్రమకే తెలుసు. చిన్మయి ఇప్పుడు నోరు ఎందుకు విప్పిందని ఆమెని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా నిజాలు బయటపెట్టినందుకు నిజానిజాలు నిగ్గు తేల్చాలి. చిన్మయిని ప్రశ్నిస్తున్న వారు వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి బాధితులను ప్రశ్నించడం ఏంటి..? చిత్రపరిశ్రమ ఏక పక్షంగా వ్యవహరిస్తోంది. నేను ఓ ప్రైవేట్ ఛానెల్ లో పనిచేస్తోన్న సమయంలో వైరముత్తు అక్కడ పనిచేసే ఓ యాంకర్ ని వేధించిన విషయం నాకు  తెలుసు'' అంటూ చెప్పుకొచ్చింది.

ఇది ఇలా ఉండగా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తు శుక్రవారం అస్వస్థతకి గురయ్యారు. మదురైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. 

ఇవి కూడా చదవండి.. 

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!