'అరవింద సమేత వీర రాఘవ' సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఇదే పేరు కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబందించిన అనేక వార్తలు మీడియాల్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

ఇక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ దర్శకుడు త్రివిక్రమ్ చిన్న మాటతో చెక్ పెట్టాడు. తారక్ సినిమాలో ఎమోషన్ ని చాలా బాగా పండించాడని ఏ సీన్ లో కూడా రిలాక్స్ గా కనిపించాడని చెప్పారు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో అయితే విశ్వరూపాన్ని చూస్తారని అన్నారు. 

దీంతో త్రివిక్రమ్ చెప్పిన విషయాన్నీ గమనిస్తే తారక్ వీర రాఘవగా స్క్రీన్ పై అదరగొట్టేస్తాడని చెప్పవచ్చు. ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ కి మంచి టాక్ వచ్చింది. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతూనే ఉంది. మరి అరవింద సమేత సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.                .