సీనియర్ హీరో అర్జున్ గురించి తెలుగు, తమిళ భాషల్లో తెలియని వారుండరు. ఇండస్ట్రీలో ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడని టాక్ ఉండేది. అయితే కోలీవుడ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ అతడిపై చేసిన ఆరోపణలు షాక్ కి గురి చేశాయి.

బాలీవుడ్, కోలీవుడ్ లలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. తాజాగా శ్రుతి హరిహరన్ కూడా అర్జున్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన కామెంట్స్ చేసింది.

రెండేళ్ల క్రితం అర్జున్ హీరోగా నటించిన ఓ సినిమాలో అతడి భార్య పాత్రలో శ్రుతి నటించింది.  షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పకుండానే అర్జున్ కావాలని తనను గట్టిగా కౌగిలించుకొని, తన వీపు భాగాన్ని.. ఆ కింద భాగాన్ని వేరే భావనతో గట్టిగా నొక్కాడని ఆ సమయంలో తాను ఎంతో ఇబ్బందికి గురైనట్లు శ్రుతి సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. 
అర్జున్ అలా చేయడం దర్శకుడు కూడా గమనించారని తెలిపింది.

అప్పుడు ఈ విషయంపై మాట్లాడలేకపోవడానికి కారణం అర్జున్ కి ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతలేనని వెల్లడించింది. చిన్నప్పటినుండి ఓ నటుడిగా అతడిని అభిమానించినట్లు.. అయితే సెట్ లో అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధ పడ్డానని వెల్లడించింది. మరి దీనిపై అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!