ప్రస్తుతం దేశంలో 'మీటూ' మూమెంట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ఒక్కొక్కరిగా బయటకి వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలని బహిర్గతం చేస్తున్నారు. సినీపరిశ్రమలో ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి.

ఏడు జాతీయ అవార్డులను, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్న ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తు తమను లైంగికంగా వేధించాడని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. అతడి దగ్గర పని చేసిన ఓ పద్దెనిమిదేళ్ల గాయనితో అతడు తప్పుగా ప్రవర్తించడంతో ఆమె భయపడిపోయింది.

ఆయన కారణంగా ఎందరోఇబ్బంది పడ్డారని, కానీ అతడిని ఎదిరించి మాట్లాడలేరని.. తనకున్న పరిచయాలతో బాధితుల నోళ్లు మూయిస్తున్నాడని సదరు గాయని జర్నలిస్ట్ సంధ్యామీనన్ కి మెసేజ్ చేయగా ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన సింగర్ చిన్మయి.. తన స్నేహితురాలు కూడా వైరముత్తు కారణంగా ఇబ్బంది పడిందని ఆమె ఈ విషయం చెప్పినప్పుడు వణికిపోయానంటూ చిన్మయి ట్వీట్ చేసింది. 

బాధితులు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడటం లేదని చిన్మయి వెల్లడించారు. అసలు తమ కెరీర్‌ను రిస్క్‌లో పడేసే ఇలాంటి సంఘటనల గురించి మహిళలు ఎందుకు బయటకు చెప్పడం లేదని చిన్మయి ప్రశ్నించారు. అతడి కారణంగా ఇబ్బంది పడిన వారు ఎవరున్నా బయటకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. 

ఇది కూడా చదవండి.. 

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు