ప్రముఖ తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తమను లైంగికంగా వేధించాడని కొందరు మహిళా సింగర్స్ ఆరోపణలు చేస్తున్నారు. వైరముత్తు తనను హోటల్ రూమ్ కి రమ్మని మరొకరితో కబురు పంపించాడని సింగర్ చిన్మయి కూడా వెల్లడించింది.

ఆయన వేధించినట్లు కొందరు మహిళలు చిన్మయికి పెట్టిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ ల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఈ విషయంపై కమల్ హాసన్ స్పందించి బాధితురాలే ముందుకు వచ్చి మాట్లాడాలని, ఆమె తరఫున మరొకరు మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. మీటూ పోరాటం న్యాయబద్ధంగా జరిగితే నేను కూడా మద్దతు ఇస్తానని కమల్ హాసన్ అన్నారు.

ఇప్పుడు వైరముత్తు స్వయంగా ఈ విషయంపై మాట్లాడారు. తనపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అవి నిజమైతే మహిళలు తనపై కేసు పెట్టొచ్చని, లీగల్ గా ఈ సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

తన క్యారెక్టర్ గురించి ఒకరు చెప్పక్కర్లేదని, న్యాయస్థానమే దాన్ని నిర్ణయిస్తుందని అన్నారు. ఇది ఇలా ఉండగా.. వైరముత్తుకి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని చిన్మయి అన్నారు. 

ఇది కూడా చదవండి.. 

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!