ప్రస్తుతం సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరుగా బయటకొస్తూ తాము ఎదుర్కొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో 
పంచుకుంటున్నారు.

తాజాగా పాకిస్థానీ నటి సోమీ అలీ తన జీవితంలో ఎందరో మృగాళ్ల కారణంగా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. ఇదేళ్ల వయసులో తనను  అసభ్యకరంగా తాకాలని చూసినట్లు, 14 ఏళ్ల వయసులో రేప్ చేసినట్లు సంచలన విషయాలను బయటపెట్టింది. ఒకప్పుడు ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్. అతడితో కలిసి సినిమాల్లో కూడా నటించింది.

బాలీవుడ్ లో సినిమాలు చేసే సమయంలో 'ఆందోళన్' చిత్ర దర్శకుడు తనను వేధించినట్లు తెలిపింది. ఒకసారి మేకప్ మెన్ తన పెదాలు తడిమి చాలా బావున్నాయని ముద్దుపెట్టుకోబోతుంటే తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

సదరు మేకప్ మెన్ మాధురి దీక్షిత్ పెర్శనల్ మేకప్ మెన్ అని రివీల్ చేసింది. ప్రస్తుతం ఆమె హ్యూమన్ ట్రాఫికింగ్, డోమెస్టిక్ వయలెన్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని ఆడుకోవడానికి ఓ కంపనీ రన్ చేస్తున్నట్లు తెలిపింది. బాలీవుడ్ లో తనుశ్రీదత్తా ధైర్యంగా ముందుకురావడాన్ని సమర్ధిస్తూ మాట్లాడింది!

ఇవి కూడా చదవండి.. 

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!