'మీటూ' ఉద్యమం అండతో చాలా మంది మహిళలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను, లైంగిక వేధింపుల గురించి బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది దర్శకులు, నటులు, టెక్నీషియన్స్ పై ఈ ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ లేడీ డైరెక్టర్ తనను ఓ దర్శకుడు లైంగిక వేధింపులకి గురి చేశాడని ఆరోపణలు చేసింది. 

'విరుంబుగిరేన్'‌,'తిరుట్టుపయలే' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సుశి గణేశన్ కారులో తనను లైంగికంగా వేధించాడంటూ లేడి డైరెక్టర్ లీనా మణిమేఖలై వెల్లడించింది. పడేమూడేళ్ళ క్రితం తాను రైటర్ గా, వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో సుశి గణేశన్ ని ఓ స్టూడియోలో ఇంటర్వ్యూ చేసిందట.

ఆ ఇంటర్వ్యూ ముగిసిన తరువాత ఆమె తిరిగి ఆటోలో వెళ్లబోతుంటే.. ఆయన తన కారులో లిఫ్ట్ ఇచ్చాడని, ఆ సమయంలో తన సెల్ ఫోన్ విసిరి కొట్టి తన ఫ్లాట్ కి రావాలంటూ లైంగిక చేష్టలతో విసిగించాడని సుశి గణేశన్ గురించి చెప్పుకొచ్చింది. తన బ్యాగ్ లో ఉన్న కత్తితో అతడిని బెదిరించి బయటపడినట్లు తెలిపింది.

ఈ ఆరోపణలపై స్పందించిన సుశి గణేశన్ కావాలనే ఆమె ఇటువంటి ఆరోపణలు చేస్తుందని, సినీ గేయ రచయితగా ఆమె ఎదగలేకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన వద్ద చేర్చుకోమని వేధించిందని తిరిగి లీనా మణిమేఖలైపై విమర్శలు చేశాడు. ఆమె కుటుంబాన్ని దూషిస్తూ మాట్లాడి పరువు నష్టం దావా వేస్తానని బెదిరించాడు. దీనికి సమాధానంగా మణిమేఖలై తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించే హక్కు అతడికి లేదని, ఛాన్సుల కోసం ఆమె సుశి గణేశన్ వెంట పడలేదని క్లారిటీ ఇచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!